Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కంధమాల్

కంధమాల్ - ఆశ్చర్యపరిచే మనోహరమైన ప్రకృతి ఒడి !

20

కంధమాల్, ఒరిస్సా లోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటి. ప్రకృతి అందంతో, అనుగ్రహంతో అలంకరించబడి, దేశీయ తెగలు నివసించే ఈ ప్రాంతం కొన్ని ప్రత్యేక తెగల జనాభాకు నివాసం. ఖండమల్ పర్యాటక రంగం, ఎత్తైన దరింగ్ బడి కొండల పైన అల్లుకొని ఉన్న కాఫీ తోటలను తన సందర్శకులకు ప్రదర్శిస్తుంది. ఖండమల్, చేతితో తయారు చేసిన ఆశ్చర్యపరిచే కేన్, డొక్ర, టెర్రకోట, వెదురు కళాకృతులతో అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

కంధమాల్ అనేక పర్యాటక కేంద్రాలతో నిండి ఏడాది పొడవునా అనేక మంది ప్రకృతి అన్వేషకులను ఆహ్వానిస్తుంది. పటుడి జలపాతం, లుడు జలపాతం, కట్రమల్, పకడదర జలపాతాలు తమ అందంతో దగ్గరలోని, దూరప్రాంతాల సందర్శకులను ఒకే రకంగా ఆశ్చర్యపరుస్తుంది. చకపడ గ్రామం, అక్కడ ఉన్న ప్రత్యేకమైన శివాలయంతో, ఆలయ ప్రాంగణంలో దక్షిణానికి వంగిన చెట్లతో సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. రెండు కొండల కలయికతో పుట్టిన బలస్కుంప గ్రామం ఒక అద్భుతమైన సుందరదృశ్యాల ప్రాంతం.

దట్టమైన, చొరబడలేని కొన్ని అడవి జంతువులకు కూడా నివాసమైన అడవులలో స్థానిక గిరిజనులు నివసించే బెల్ఘర్, కంధమాల్ లోని అసాధారణ ప్రాంతాలలో ఒకటి. కళింగ లోయ చెట్ల పెంపకం, ఔషధ మొక్కల పెంపకంతో, సందర్శకులకు చక్కటి సువాసనతో అది అందించే ఉపసమనానికి, తాజాదనానికి పేరొందింది. సాహసప్రియులు ఎత్తైన దాని పర్వతాలు, సలుంకి నది మధ్య పర్వతారోహణ, బోటింగ్ కోసం ఫుల్బని వెళ్తారు. చివరిది ముఖ్యమైనది, కంధమాల్ లో పర్యాటక రంగం, శీతాకాలంలో మంచుకురిసే ఒరిస్సాలోని ఒకే ఒక్క వేసవి విడిది దరింగ్ బడి తో ఉత్తేజితమైంది.

కంధమాల్ సందర్శనకు ఉత్తమ సమయం

కంధమాల్ సందర్శనకు సెప్టెంబర్, మే మధ్య కాలం ఉత్తమమైనది.

కంధమాల్ చేరడం ఎలా

కంధమాల్ కు భువనేశ్వర్, సంబల్పూర్, బెర్హంపూర్ నుండి రోడ్డుమార్గం ఉంది. రైరఖోల్ ఇక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైలుస్టేషన్ కాగా, భువనేశ్వర్ అతిదగ్గరి విమానాశ్రయం.

కంధమాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఎలా చేరాలి? కంధమాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా కంధమాల్ కు భువనేశ్వర్, సంబల్పూర్, బెహ్రంపూర్ నుండి రోడ్డు ద్వారా చేరవచ్చు.కొన్ని సార్లు రోడ్డు ఎగుడు దిగుడుగా, గరుకుగా ఉన్నప్పటికీ ఈ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న దృశ్యాలు మాత్రం ఉత్కంఠభరితంగా మైమరపిస్తాయి. భువనేశ్వర్, సంబల్పూర్, బెహ్రంపూర్ నుండి ఫుల్బని కి అనేక బస్సులను రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా *కంధమాల్ లో రైలుస్టేషన్ లేదు. సంభాల్పూర్ జిల్లాలోని రైరఖోల్ అతి దగ్గరలోని రైలుస్టేషన్. అయితే, కంధమాల్ కు దగ్గరగా ఉన్న ప్రధాన రైలుస్టేషన్ మాత్రం ఫుల్బనికి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెహ్రంపూర్. ఈ స్టేషన్లకు చేరిన తర్వాత, ఫుల్బనికి మనం బస్సు ద్వారా లేదా, అద్దె టాక్సీల ద్వారా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా కంధమాల్ నుండి 211 కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ అతి దగ్గరి విమానాశ్రయం. ఒక చిన్న వైమానిక స్థావరం గుడారి, ఫుల్బని నుండి 5 కిలోమీటర్ల దూరంలో చిన్న విమానాలు, హెలికాప్టర్లు దిగడానికి ఉంది. అయితే, భువనేశ్వర్ చేరిన తర్వాత మనం బస్సు ద్వారా కంధమాల్ కు ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue