కుప్పం నది తీర ప్రాంతమైన పజ్హయన్గడి పట్టణం (కన్నూర్ నుండి 25 కిలో మీటర్ల దూరం) లో ని మదయిపర పచ్చని ప్రదేశం బిళ్ళ రాళ్ళతో నిండి యున్న సుందర ప్రదేశం. జివ వైవిధ్య సంపదతో అలరారే ఈ ప్రదేశం, ఎజ్హిమల రాజుల యొక్క పాలనా సమయపు గుర్తులని కలిగి ఉంటుంది.
పజ్హి కొత్త అనే పురాతన కోట మరియు వాచ్ టవర్స్ ల అవశేషాలు ఈ కొండ సమీపంలో చూడవచ్చు. మడయిక్కవు మరియు తిరువార్ కడు గా ప్రసిద్ది చెందిన భద్రకాళి అమ్మవారి గుడి ఇక్కడి మరొక విశిష్ట ఆకర్షణ. శివుని గుడి అయిన వడుకున్ను, మాలిక్ ఇబ్న్ దీనార్ మాస్క్ (మదయ్ మాస్క్) ఇక్కడ పరిసరాల్లో ఉన్న చారిత్రక ప్రాముఖ్యం కల్గిన పర్యాటక ఆకర్షణలు.
పుష్ప మరియు వృక్ష సంపదలతో ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులని విశేషంగా ఆకర్షిస్తుంది. 300 రకాల పూల మొక్కలు, 30 రకాల గడ్డి, 100 జాతుల సీతాకోకచిలుకలు ఇంకా 150 జాతుల పక్షులు ఈ ప్రదేశంలో కనిపిస్తాయని రికార్డులు తెలుపుతున్నాయి. ఈ ప్రదేశం అనేకమైన వివిధ రకాల ఔషద మొక్కలకు ప్రసిద్ది. ఎక్కువమంది పర్యాటకులు ప్రస్తుతం రానప్పటికీ తన గొప్పదనంతో భవిష్యత్తులో అతిగొప్ప పర్యాటక ప్రదేశంగా మారుతుందనడంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications