కాన్పూర్ మెమోరియల్ చర్చి ని బ్రిటిష్ ప్రభుత్వం 1875 లో కాన్పూర్ లో జరిగిన ఒక సంఘటనలో మరణించిన ఇంగ్లీష్ ప్రజల గౌరవార్ధం నిర్మించింది. అద్భుతమైన ఈ చర్చిని గతంలో అల్ సౌల్స్ కేథడ్రాల్ అనే వారు. ఇది కాన్పూర్ క్లబ్ కు సమీపంలో కాన్పూర్ కంటోన్మెంట్ ప్రదేశంలో కలదు. దీనిని గోతిక్ శైలిలో రెడ్ బ్రిక్ లతో నిర్మించారు. దేని ఒక వైపు భాగం లో ఇంగ్లీష్ ప్రజల, సైనికుల సమాధులు వుంటాయి.
చర్చిలో ఒక మెమోరియల్ గార్డెన్ కూడా కలదు. దీనికి రెండు గేటులు వుంటాయి. ఒక ఏంజెల్ ప్రాంగణం మధ్యలో వుండి ప్రపంచ శాంతిని బోధిస్తూ వున్నట్లు వుంటుంది.



Click it and Unblock the Notifications