దేవకోట్టై, సివగంగై జిల్లాలో రెండవ పెద్ద పట్టణం. ఇక్కడ ఉన్న ఆకర్షణల వలన ఈ ప్రదేశాన్ని పర్యాటకులు ప్రతి సంవత్సరం సందర్శిస్తుంటారు. ఇక్కడికి వొచ్చిన పర్యాటకులకు పట్టణంలో కల చేట్టినాడ్ మాన్షన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో సందర్శకులు వొస్తో ఉంటారు ఎందువలనంటే ఈ మాన్షన్ యొక్క అద్భుతమైన నిర్మాణం మరియు రూపకల్పనే కారణం. ఈ మాన్షన్ యొక్క పై కప్పు స్పానిష్ టైల్స్ తో, క్రింది నెల ఇటాలియన్ టైల్స్ తో మరియు మార్బుల్స్ తో మరియు ఇక్కడి స్తంభాలు స్వచ్చమైన టేకుతో తయారుచేయబడ్డాయి. ఇందులో ఉండటం కూడా ఒక గొప్ప అనుభూతి. దీని నిర్మాణ శైలి అద్భుతంగా ఉండటమే కాదు, ఇందులో పని చేసేవారు కూడా ఇక్కడకు వొచ్చే అథితులను ప్రేమగా స్వాగతిస్తారు మరియు వారిపట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ అనేకమంది విదేశీ పర్యాటకులు వారాల కొద్దీ, నెలల కొద్దీ గడుపుతారు.



Click it and Unblock the Notifications