ప్రాచి నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం చౌరాసి. ఈ ప్రదేశం బరహి, అమరేశ్రా మరియు లక్ష్మీనారాయణ వంటి చిన్న చిన్న ఆలయాలకి ప్రసిద్ది. మాతృ దేవత కి మరో పేరైన వారాహి గా కూడా బారాహి ప్రసిద్ది.
క్రీ.శ. పదవ శతాబ్దం మొదటి త్రైమాసికం లో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం లో ని ప్రధాన దైవం బరాహి దేవత. వరాహ ముఖం మరియు గుండ్రటి పొట్ట తో ఆవిడ ఉంటారు. ఒక చేతిలో చేప మరియు ఇంకొక చేతిలో కప్పు కలిగి ఉంటారు. నుదుటిపై మూడవ కన్ను కలిగి ఉంటారు.
తాంత్రిక ఆచారాల ప్రకారం ఈ దైవాన్నిపూజిస్తారు. ఈ ఆలయం అధ్బుతమైన నిర్మాణ కళ తో అలంకరించబడుతుంది. ఈ ఆలయం లో నిర్మాణానికి ఆధారం స్థాయిలో ఉన్న దీర్ఘచతురస్రాకార వాకిలి ఉంది.
ప్రతి రోజు చేప ని నైవేద్యంగా స్వీకరించే విశిష్టమైన బారాహి దేవతని దర్శించుకునేందుకు పర్యాటకులు తరలి వస్తారు. లక్ష్మినారాయణ్ మరియు అమరేశ్వర్ ఆలయాలు కూడా పర్యాటకులని ఆకర్షిస్తాయి.



Click it and Unblock the Notifications