ఓడిశాలోని పూరి జిల్లాలో, పూరి-అష్టరంగా రోడ్డులో కాకత్పూర్ అనే చిన్న గ్రామంలో నెల కొని ఉన్న ఆలయం కాకత్పూర్ ఆలయం. ఈ గ్రామం కోణార్క్ నుండి 30 కిలో మీటర్ల దూరం లో ఉంది. ప్రాచి నది ఒడ్డున ఈ ఆలయం నిర్మించబడింది. మంగళా దేవిని పూజించడానికి ఈ ఆలయం నిర్మించబడింది.
కాకత్పూర్ యొక్క ప్రధాన దైవం మంగళా దేవి. పూరి లో ని ప్రసిద్ది చెందిన జగన్నాథ్ ఆలయానికి ఈ కాకత్పూర్ ఆలయానికి ఒక అనుబంధం ఉంది. నవకలేబర లేదా విగ్రహాల పునరుద్ధరణ పండుగకు భగవాన్ జగన్నాథ ఆలయం నుండి పూజారులు ఇక్కడికి వచ్చి కొత్త జగన్నాథ్ , సుభద్ర మరియు బలభద్ర విగ్రహాలని తయారు చేసేందుకు కావాల్సిన పవిత్రమైన చెట్లని చూపించమని కాకత్పూర్ ఆలయం లో ని మంగళా దేవికి ప్రార్ధిస్తారు.
కాకత్పుర ఆలయం లో ని జరుపుకునే ప్రసిద్దమైన పండుగ ఝాము యాత్ర. హిందూ క్యాలెండర్ లో ని ప్రతి మొదటి మంగళవారం ఏప్రిల్ 14 నుండి మే 15 వరకు ఈ పండుగ వస్తుంది.



Click it and Unblock the Notifications