మునీరాబాద్ ప్రదేశానికి పౌరాణిక ప్రాధాన్యత ఉంది. మునీరాబాద్ డ్యామ్ ను తుంగభద్ర నదిపై నిర్మించారు. రిష్యమూక కొండలు, వాలి కొండ, పంప నది కూడా ఇక్కడే ఉన్నాయి. మునీరాబాద్ లోని హులిగెమ్మ దేవాలయం తప్పక చూడదగినది. హులిగెమ్మ దేవతను ఇక్కడ ఆరాధిస్తారు. దేవాలయంలోని శిలా శాసనం మేరకు ఈ దేవాలయం చాళుక్య రాజ్యంలోని ఆరవ విక్రమాదిత్య 11వ శతాబ్దంలో చతుర్వేది భట్టకు అప్పగించారు. దేవాలయం చూసే భక్తులు మొదటగా ఒక పెద్ద స్తంభాన్ని చూస్తారు. దీనినే ధ్వజస్తంభం అంటారు. ఇది షుమారు 25 అడుగుల ఎత్తు ఉండి పర్యాటకులకు కళ్ళు తిప్పలేనంత ఆకర్షణ కలిగిస్తుంది. దేవాలయ యాజమాన్యం ప్రతి సంవత్సరం కొన్ని వేడుకలు చేస్తుంది. దీనికి వేలాది భక్తులు హాజరవుతారు.
హులిగెమ్మ దేవాలయానికి సందర్శకులు రోడ్డు మరియు రైలు మార్గాలలో చేరవచ్చు. బస్ సర్వీసులు అన్ని ప్రధాన పట్టణాలనుండి ఉన్నాయి. మునీరాబాద్ రైలులో హంపినుండి కూడా చేరవచ్చు. హోస్పేట జంక్షన్ సమీప రైలు స్టేషన్ అవుతుంది.



Click it and Unblock the Notifications