కిషోర్ సాగర్ సరస్సుకు దగ్గరగా వున్న బిర్జ్ విలాస్ పేలస్ లో వుండే ప్రభుత్వ మ్యూజియం కోట లోని ప్రసిద్ధ యాత్రిక ఆకర్షణ. ఈ మ్యూజియం లో పాత నాణేలు, పురాతన వ్రాత ప్రతులు, హదోటి శిల్పాల అరుదైన సంగ్రహం వుంది. ఇక్కడ ప్రదర్శించిన శిల్పాలన్నిటిలోకి బరోలి నుంచి తెచ్చిన శిల్పం ఆశ్చర్యం గొల్పుతుంది. అది చాలా అందంగా చెక్కిన కళాకృతి.
ఇక్కడ ప్రదర్శించిన కొన్ని శిల్పాలు దాదాపు 4వ శతాబ్దం నాటివి. ఇక్కడ ప్రదర్శించిన చేతిరాత ప్రతులు, చిత్రాలు మధ్య యుగాల నాటి మనుషుల సృజనాత్మకతను గురించి తెలియచేస్తాయి. ఇవే కాక ఇక్కడ అందమైన దుస్తులు, చేతిపని తో చేసిన వస్తువులు కూడా చూడవచ్చు.ఈ మ్యూజియం ను సందర్శించడానికి జైపూర్ లోని పురావస్తు ప్రదర్శనశాలల డైరెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇది శుక్రవారం నాడు, ప్రభుత్వ శెలవు దినాల్లోను మూసి వుంటుంది. పని దినాల్లో రెండు రూపాయల నామమాత్రపు రుసుము చెల్లించి ఉదయం 10నుంఛి సాయంత్రం 5 గంటల దాకా ఈ మ్యూజియం ను చూడవచ్చు. మ్యూజియం ఆవరణలో ఫోటోలు తీయడానికి అనుమతి లేదు.



Click it and Unblock the Notifications