రావు మాదో సింగ్ మ్యూజియం కోట లోని ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణ. కోటకు మొదటి రాజైన మాదో సింగ్ రాజు పేరిట దీనికా పేరు పెట్టారు. రాజప్రాసాదాన్ని తర్వాతి కాలంలో మ్యూజియంగా మార్చారు. నమూనాలను ఒక వరుస పద్ధతి లో పేర్చి ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యూజియం లో ప్రతి వస్తువు పదిలంగా భద్రపరచడం వలన రాజస్థాన్ లోని ఉత్తమ మ్యూజియంలలో ఇది ఒకటిగా మారింది.ఈ మ్యూజియంలో అందమైన చిత్రాలు, పురాతన నాణేలు, వెండి పాత్రలు, వ్రాతప్రతులు, శిల్పాలు, సూక్తులు, విగ్రహాలు, ఆయుధాలు, కుడ్య చిత్రాలు పర్యాటకులు చూడవచ్చు. కోట చిత్ర శైలికి చెందిన చిన్న చిన్న చిత్రాలు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియం ప్రభుత్వ సెలవు దినాలు, శుక్రవారాలలో మూసి ఉంటుంది.



Click it and Unblock the Notifications