కోవలం బీచ్ నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చోవారా చేపలు పట్టే గ్రామం. ఈ గ్రామం విజింజమ్ కి దక్షిణం వైపు ఉంది. కోవరా ప్రత్యేకంగా పర్యాటకులు మనోహరమైన, ఉల్లాసవంతమైన తెల్లని ఇసుకలో అనేక కిలోమీటర్లు నడవడమే ఇక్కడి ప్రధాన ఆకర్షణ. చోవారా బీచ్ కు దగ్గరగా బాగా పొడవైన అజిమలతురా అనే మరో తీరం ఉంది. పర్యాటకులు కాలినడకన లేదా స్కూటర్ల పై ఈ గ్రామాన్ని అన్వేషించే అవకాశం ఉంది. గేర్లు లేని స్కూటర్లు అద్దెకు అందుబాటులో ఉంటాయి. ఈ గ్రామంలో కొండపై నిర్మించబడిన ప్రముఖ అయ్యప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రతి ఏటా నవంబర్ 15 నుండి ప్రారంభించి 56 రోజుల సుదీర్ఘ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ పండుగ జనవరి 15 కు పూర్తి అవుతుంది. ఈ ఆలయం అయ్యప్ప భక్తులలో అత్యంత ప్రజాదరణ పొందింది, ప్రతి ఏటా వేలమంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి గుడికి తరలి వస్తారు. ఈ గ్రామం సాంప్రదాయ, ఆధునిక మిశ్రమాలతో ఆసక్తికరమైనది. ప్రతి ఒక్కరూ దీనిని సందర్శించి అనుభవించవలసిందే.