వలియతురా, తిరువనంతపురం శివార్లలోని ఒక ప్రసిద్ధ రేవు. ఇది వలియతురా శివార్లలో ఉండడం వలన ఈ రేవుకి ఆపేరు వచ్చింది. ఒకప్పుడు కేరళ లోని దక్షిణ తీరంలో ఏకైక రేవుగా ఈ ప్రాంతం పేరెన్నికగన్నది. కోచీ అన్ని సముద్ర కార్యకలాపాల కేంద్రం అయిన తరువాత వలియతురా దాని ప్రాముఖ్యతని కోల్పోయింది. ఈరోజు, ఈ ప్రాంతం కేవలం చేపలను వేటాడే గ్రామంగా ఉండిపోయింది. ప్రసిద్ధ వలియతురా రేవు 50 సంవత్సరాల కంటే పురాతనమైనది, దీని వెనకాల గోడౌన్ ల పెద్ద విభాగం ఉంది. వలియతురా నౌకాశ్రయంగా విరాజిల్లుతున్నపుడు ఈ గోడౌన్ లు పుష్కలంగా నిండి ఉండేవి. ఓడనుండి వస్తువులు దిగుమతి చేయడానికి ఈ రేవుని లోతు తక్కువ ప్రాంతంలో నిర్మించారు. ఓడను లోతు లేని చోట నిలపడం సాధ్యం కాదు కాబట్టి, ఓడలో వస్తువులను మార్చడానికి చిన్న పడవల ద్వారా రేవుకి బదిలీ చేస్తారు. ప్రస్తుతం జాలర్లు సముద్రంలోకి దుంగలతో కట్టిన బల్లను వదలడానికి బలహీన పడిన ఈ రేవుని ఉపయోగిస్తున్నారు. అయితే, సందర్శకులను భద్రత కారణాల దృష్ట్యా రేవుపైకి అనుమతి౦చడం లేదు.



Click it and Unblock the Notifications