కురుక్షేత్ర పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త అయిన ఓ.పి.జిందాల్ కొడుకు నవీన్ జిందాల్ 2005 మార్చ్ 31న ఆయన చనిపోక ముందు హర్యానా పవన్ మినిస్టర్ గా ఉన్న తన తండ్రి శ్రీ.ఓ.పి.జిందాల్ జ్ఞాపకార్ధం ఓ.పి.జిందాల్ పార్క్, మ్యూజికల్ ఫౌంటైన్ ను అభివృద్ది చేసాడు.
ఈ పార్క్ 14 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇక్కడ ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ ఉత్తర భారతదేశంలోనే అతిపెద్దదిగా పేర్కొనబడింది. ఇక్కడ నలుగు అడుగుల ఎత్తులో శ్రీ.ఓ.పి.జిందాల్ నడుమువరకు కనిపించే విగ్రహం ఉన్న ఒక తోట కూడా ఉంది. ఈ పార్కు అన్ని వయసుల వారికి, అభిరుచి గల ప్రజలకు పెద్ద సంఖ్యలో వినోద సౌకర్యాలను అందిస్తుంది. ఇక్కడ పిల్లలకు రంగురంగుల ఉయ్యాలలు, పెద్దవారికి ఆటల విభాగం, వినోద ప్రదేశం, పెద్దవారికి కూర్చునే బల్లలు, అందమైన జంతుప్రదర్శన శాల, ధ్యానం కోసం ఒక తోట, జాగింగ్ ట్రాక్, అందమైన గులాబీ తోట వంటి అనేక రకాలు ఉన్నాయి. ఈ ప్రత్యెక పార్కు ప్రతివక్కరికీ ఏదో ఒకటి అందిస్తుంది.



Click it and Unblock the Notifications