మలంపూజ లో కల రాక్ గార్డెన్ కేరళ లో ఈ రకం వాటిలో మొదటిది. ఇండియా లో రెండవ గార్డెన్ రాక్. ఇది మలంపూజ డాం మరియు గార్డెన్ల కు సమీపంగా ఉంటుంది. దాని ప్రత్యేకతతో ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఈ అద్భుత రాక్ గార్డెన్ రూప శిల్పి పద్మ శ్రీ బిరుదు ఇవ్వబడిన నెక్ చాంద్ సాయాని. నెక్ చాంద్ ఇండియా లోని చండీగఢ్ లో కల మొదటి రాక్ గార్డెన్ కూడా నిర్మించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది.
ఈ గార్డెన్ నిర్మాణం లో పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్ళు , కేన్లు, చేతి గాజుల ముక్కలు, ఎలక్ట్రిసిటీ ఫూస్ కారియర్లు, పవర్ ఇన్సు లేటర్లు , మేళ మైన్ డిష్ వేర్ , పగిలిన టైల్స్ మరియు డబ్బాలు వంటివి ఉపయోగించారు. పరిసరాలలో కల పడమటి కనుమల అందాలు ఈ గార్డెన్ కు మరింత శోభ నిచ్చాయి.
1996 నుండి ఈ రాక్ గార్డెన్ జిల్లా టూరిజం ప్రోమోషన్ కౌన్సిల్ నిర్వహణలో కలదు. కళా ప్రియులకు ఇది ఒక స్వర్గం లా ఉంటుంది.