తెన్ కురుస్సి గ్రామం దాని సహజ అందాలకు మరియు వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి గాంచింది. ఇది పాలక్కాడ్ కు సుమారు 10 కి.మీ. దూరంలో కలదు. ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం అనుకూలం. పాలక్కాడ్ పట్టణం నుండి తరచుగా బస్సులు కలవు. కొద్దిసేపు ప్రయాణం మాత్రేమే. తెన్ కురిస్సి నుండి ఒక గంట ప్రయాణించి నారింజ తోటలు కల నేల్లియంపతి ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. ఈ అందమైన్ గ్రామం లో అనేక దేవాలయాలు కలవు. ఈ గ్రామం ప్రసిద్ధి గాంచిన తాయంకావు , ఎలామన్నం సంకరనరాయనన్ మరియు శివ దేవాయలాలు కలిగి ఉంది.
.తెన్ కురుస్సి లోని శివాలయం చాల పురాతమైనది. శతాబ్దాల క్రిందటిది గా చెపుతారు. అయ్యపంవిలక్కు, శివరాత్రి, నవరాత్రి, తిరువతిర వంటి వేడుకలు చేస్తారు. విషు, ఉత్తరాదం మరియు తిరువోణం లను మరింత ఘనం గా జరుపుతారు. ఈ ప్రదేశం నేల్లియంపతి మరియు నేన్నర ప్రదేశాలకు సమీపం, భక్తి, చరిత్రల పట్ల ఆసక్తి కలవారు తప్పక చూడాలి.



Click it and Unblock the Notifications