Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మలయత్తూర్

మలయత్తూర్ - ప్రకృతి సంస్కృతితో కలిసే ప్రదేశం

14

మలయత్తూర్ ఎర్నాకులం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు మూడు మళయాళం మాటలనుండి వచ్చింది. మల అంటే పర్వతం, అర్ అంటే నది మరియు ఊర్ అంటే స్ధలం అని చెపుతారు. చిన్నది మరియు సుందరమైనది అయిన ఈ పట్టణం పడమటి కనుమలకు మరియు పెరియార్ నదికి మధ్యన పర్వతాలు, భూమి మరియు నీరు కలిసే ప్రదేశంలో కలదు.

మలయత్తూర్ ఒక పురాతన కేధలిక్ చర్చికి ప్రసిద్ధి చెందింది. ఈ చర్చి క్రైస్తవ బోధకుడు సెయింట్ ధామస్ కు అంకితమివ్వబడినది. ఈ ప్రదేశం క్రిస్టియన్లకు యాత్రా స్ధలమే కాదు. సుందర అందాలు కల పట్టణం. ఇక్కడ సెయింట్ ధామస్ చర్చి మాత్రమే కాక, మరో రెండు చర్చిలు కలవు. వీటిని చర్చి ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ మరియు సెయింట్ సెబాస్టియన్ చర్చిలంటారు. ఇక్కడే దుర్గా దేవి దేవాలయం కూడా కలదు. మలయత్తూర్ వచ్చే యాత్రికులు మూలం కుజ్జి మరియు మహాగని తోట్టం ప్రదేశాలు కూడా చూడవచ్చు.

దైవ భూమిలోని రుచులు మరియు కాలాలు

భక్తులు మరియు పర్యాటకులు సంవత్సరం పొడవునా ఈ చర్చికి వస్తూనే ఉంటారు. చర్చి ఎల్లపుడూ జన సమూహాలతో వుంటుంది. అయితే, వర్షాకాలంలో వర్షాలు అధికం కనుక సైట్ సీయింగ్ అసాధ్యమవుతుంది. మలయత్తూర్ పర్యటనకు శీతాకాలం అనుకూలమైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మలయత్తూర్ కొచ్చి నుండి 47 కి.మీ. ల దూరంలో ఉండి, ఇరుగు పొరుగు జిల్లాలకు రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. ఇక్కడ తయారయ్యే ఆహారాలు మళయాళీల రుచులుగా ఉంటాయి. చిన్న హోటళ్ళు, కాఫీ హౌస్ లు ఈ ప్రదేశం ప్రత్యేకత. పండుగ సందర్భాలలో టవున్ బిజీ గా ఉండే సమయంలో పర్యాటకుల సౌకర్యార్ధం కొత్త తాత్కాలిక హోటళ్ళు కూడా తెరుస్తారు.

మలయత్తూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మలయత్తూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మలయత్తూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మలయత్తూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం మలయత్తూర్ కు కొచ్చి నుండి బస్సులు కలవు. వివిధ నగరాలనుండి ప్రభుత్వ బస్సులు, ప్రయివేటు బస్సులు కూడా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం మలయత్తూరుకు సమీప రైలు స్టేషన్ ఎర్నాకులం. ఎర్నాకులం రైలు స్టేషన్ నుండి దేశంలోని అన్ని నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి ఆటో రిక్షాలు లేదా టాక్సీలలో మలయత్తూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం మలయత్తూర్ కు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం. విమానాశ్రయం నుండి మలయత్తూరు కు టాక్సీలు లభిస్తాయి. విమానాశ్రయం నుండి మలయత్తూర్ 15 కి.మీ. దూరం కాగా దీనికి రూ400 మాత్రమే టాక్సీ ఛార్జీలు అవుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 May,Sun
Return On
11 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 May,Sun
Check Out
11 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 May,Sun
Return On
11 May,Mon