అర్ధుంకుల్ బీచ్ ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటుంది. ఒక గ్రామంలో సముద్రపు ఒడ్డున కలదు. ప్రభుత్వం దీనిని పర్యాటక స్ధలంగా గుర్తించింది. ఒంటరిగా ప్రశాంత మనస్సు తో గడపాలనుకునేవారికి ఇది చాలా బాగుంటుంది. ఈ బీచ్ కు మధ్యాహ్నం 3.30 గంటలనుండి 4.30 గంటల వరకు చక్కని నీరెండ ఉండి ఆహ్లాదం కలిగిస్తుంది. అంతు తెలియని సంఖ్యలో తాటి చెట్ల వరుసలు, ఫిష్టింగ్ బోట్లు, గ్రామీణ ప్రాంత జీవన విధానాలు కనపడతాయి. అర్ధంకుల్ చర్చికి వచ్చే వారు తప్పని సరిగా ఈ బీచ్ వస్తారు. ఈ ప్రాంతంలో మీకు నోరు ఊరే ఆహారంగా మంచి గొడ్డు మాంసం, చికెన్, వివిధ రకాల చేపలు, పీతలు లభ్యంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications