Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నాగార్జున సాగర్

నాగార్జునసాగర్: బౌద్ధుల యొక్క పట్టణం

10

నాగార్జునసాగర్, ప్రపంచంలో ఉన్న బౌద్ధులకు ముఖ్యమైన స్థలము. ఇది దక్షిణ భారత రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో ఒక చిన్న పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఒక పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందుతూ అదే విధంగా ఒక ముఖ్యమైన పర్యాటక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందుతూ ఉంది.

పురాతన రోజుల్లో దీనిని విజయపురి అని కూడా పిలిచేవారు.కాలక్రమేణ ఒక బౌద్ధ భక్తుడు నాగార్జున పేరుతొ ఈ పట్టణం యొక్క పేరు ఏర్పడింది. ఆయన భగవత్స్వరూపమైన బుద్ధుడికి ఒక గొప్ప ఆరాధ్య భక్తుడే కాదు అక్కడి ప్రజలచేత కూడా కీర్తించపడ్డాడు. అతను మొదటి శతాబ్దం ఏ.డి. చివరి వరకు,అంటే 60 సంవత్సరాల వరకు బుద్ధుల సంఘ నాయకుడిగా ఉన్నారు. దీనివలన దక్షిణ భారతంలో సహస్రాబ్ది ప్రారంభ కాలము నుండే ఇది ఒక ముఖ్యమైన బౌద్ధుల పవిత్రమైన స్థలంగా ఉందని తెలుస్తుంది.

పురాతన తవ్వకాలలో ఈ ప్రాంతంలో బౌద్ధ మతం ప్రసిద్ధి చెందినట్లుగా సాక్ష్యాధారాలు కనిపించాయి. ఈ ఆధారాలు అన్నీ స్తూపాలు మరియు శిల్పాల రూపంలో బుద్ధుడి జీవిత చరిత్ర గురించి, అతనియొక్క బోధనల గురించి ఉన్నాయి. ఈ సాక్ష్యాధారాలవలన నాగార్జునసాగర్ ఒక ముఖ్యమైన పురావస్తు స్థలంగా కూడా పేరు పొందింది.

నాగార్జునసాగరులో పర్యాటకులు చూడవలసిన స్థలాల్లో ముఖ్యమైనవి నాగార్జునసాగర్ డాం, ఎత్తి పోతల జలపాతాలు మరియు నాగార్జునకొండ ఉన్నాయి. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 150 కి.మీ.దూరంలో ఉన్నది. హైదరాబాద్ నుండి ఈ పట్టణాన్ని రోడ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. నాగార్జునసాగర్ చేరుకోవటానికి అనేక బస్సు సర్వీసులు పెద్ద నగరాలనుండి మరియు పట్టణాలనుండి నడుపబడుతున్నాయి. బస్సు ప్రయాణం ఉత్తమం ఎందుకంటె ఈ పట్టణానికి చేరుకోవాలంటే అక్కడ రైల్వే స్టేషన్ కాని, విమానాశ్రయం కాని లేవు.

నాగార్జునసాగర్ సందర్శించటానికి శీతాకాలం బాగుంటుంది. ఎందుకంటే ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల మూలంగా, వేసవిలో అతివేడి, చలికాలంలో కొద్ది చలి ఉంటుంది.

 

నాగార్జున సాగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నాగార్జున సాగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నాగార్జున సాగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నాగార్జున సాగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా ఇరుగు పొరుగు పట్టణాలు మరియు గ్రామాల నుండి నాగార్జునసాగర్ పట్టణం చేరుకోవాలంటే రోడ్ ద్వారానే చేరుకోవాలి. ఎందుకంటే వేరే ఇతర సౌకర్యం లేదు. ఈ పట్టణ రహదారులు మంచి స్థితిలో ఉన్నాయ్ మరియు చెన్నై, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం నుండి బస్సులు నిత్యం తిరుగుతున్నాయి. డీలక్స్ మరియు వోల్వో బస్సులు కూడా ప్రధాన నగరాలకు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా నాగార్జునసాగర్ నుండి 135 కి.మీ. దూరంలో గుంటూరు రైల్వే స్టేషన్ ఉన్నది. దక్షిణ భారత దేశంలో ఉన్న పెద్ద నగరాలను మరియు పట్టణాలను అనుసంధిస్తూ గుంటూరు రైల్వే స్టేషన్ ఉన్నది. చెన్నై నుండి చాల రైళ్ళు గుంటూరు పట్టణం గుండా హైదరాబాదుకు వెళుతున్నాయి. రైలులో వచ్చే వారు నాగార్జునసాగర్ చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుండి టాక్సీలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా నాగార్జునసాగర్లో విమానాశ్రయం లేదు. రాజీవ్ మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ సమీపంలో ఉంది. ఈ విమానాశ్రయం దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా రెండు విధాలుగా ఉపయోగిస్తారు మరియు అలాగే ప్రపంచ దేశ ఇతర భాగాలకు కూడా అనుసంధానించబడింది. ఈ విమానాశ్రయం పట్టణానికి 135 కి.మీ. దూరంలో ఉన్నది మరియు నాగార్జునసాగరుకు విమానాశ్రయంనుండి రావటానికి టాక్సీలు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed