నంది హిల్స్ బెంగుళూరుకు 33 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి ఈ ప్రదేశం షుమారు 4,851 అడగుల ఎత్తులో ఉంది. చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఈ కొండలు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంగా ఉండి పర్యాటకులకు తేలికగా సందర్శన చేయగల ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. గత వైభవ చిహ్నాలు నంది హిల్స్ చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. దాని మూలాలలోకి వెళితే, అంతా ఒక రహస్యంగా ఉంటుంది. కొంతమంది ఈ కొండల ఆకారం నిద్రించే ఎద్దు ఆకారాన్ని గుర్తు చేస్తుందంటారు. దాని కారణంగా దానికి నంది హిల్స్ అని పేరు వచ్చిందంటారు.
ఈ కొండలు చోళుల కాలంనాడు ఆనంద గిరిగా పిలువబడ్డాయని కూడా చెపుతారు. చోళుల కాలంనాటి శిల్ప సంపదలు ఈ కొండలలో కనపడతాయి. ఈ కొండలు మొట్ట మొదటి స్వాతంత్ర పోరాటాన్ని కూడా గుర్తు చేస్తాయి. టిప్పు సుల్తాన్ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. దానికే నందిదుర్గ అని పేరు. ఈ కోట అభేధ్యమైన కోటగా చెప్పబడేది. అయినప్పటికి 1791 లో బ్రిటీష్ పాలకులు దీనిని ఆక్రమించారు.
నంది హిల్స్ పర్యటన మరచిపోలేనిది. టిప్పూస్ డ్రాప్ అనే ప్రదేశంలో చక్రవర్తి మరణశిక్షపడ్డ ఖైదీలను పడవేసి మరణించేలా చేసేవాడు. అతని రహస్య మార్గం, వేసవి విడిది భవనం వంటివి ఈ కొండలకు చారిత్రక జీవాన్ని పోస్తాయి. ఇక్కడే అనేక అందమైన దేవాలయాలు అంటే గావి వీరభధ్ర దేవాలయం వంటివి ఉన్నాయి. అమృత సరోవర్ నీటి సరస్సు, ఉద్యానవన తోటలు వంటివి ఇది ఒక వినోద పర్యటనా స్ధలంగా చేశాయి. ఇక్కడ పేరా గ్లైడింగ్ మరియు సైకిలింగ్ వంటివి కూడా చేయవచ్చు.



Click it and Unblock the Notifications