Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నంది హిల్స్

నంది హిల్స్ - చారిత్రక ప్రాధాన్యత - ప్రకృతి అందాల కలయిక

54

నంది హిల్స్ బెంగుళూరుకు 33 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి ఈ ప్రదేశం షుమారు 4,851 అడగుల ఎత్తులో ఉంది. చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఈ  కొండలు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంగా ఉండి పర్యాటకులకు తేలికగా సందర్శన చేయగల  ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.  గత వైభవ చిహ్నాలు   నంది హిల్స్ చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. దాని మూలాలలోకి వెళితే, అంతా ఒక రహస్యంగా ఉంటుంది. కొంతమంది ఈ కొండల ఆకారం నిద్రించే ఎద్దు ఆకారాన్ని గుర్తు చేస్తుందంటారు. దాని కారణంగా దానికి నంది హిల్స్ అని పేరు వచ్చిందంటారు.

ఈ కొండలు చోళుల కాలంనాడు ఆనంద గిరిగా పిలువబడ్డాయని కూడా చెపుతారు. చోళుల కాలంనాటి శిల్ప సంపదలు ఈ కొండలలో కనపడతాయి. ఈ కొండలు మొట్ట మొదటి స్వాతంత్ర పోరాటాన్ని కూడా గుర్తు చేస్తాయి. టిప్పు సుల్తాన్ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. దానికే నందిదుర్గ అని పేరు. ఈ కోట అభేధ్యమైన కోటగా చెప్పబడేది. అయినప్పటికి 1791 లో బ్రిటీష్ పాలకులు దీనిని ఆక్రమించారు.  

నంది హిల్స్ పర్యటన మరచిపోలేనిది. టిప్పూస్ డ్రాప్ అనే ప్రదేశంలో చక్రవర్తి మరణశిక్షపడ్డ ఖైదీలను పడవేసి మరణించేలా చేసేవాడు. అతని రహస్య మార్గం, వేసవి విడిది భవనం వంటివి ఈ కొండలకు చారిత్రక జీవాన్ని పోస్తాయి. ఇక్కడే అనేక అందమైన దేవాలయాలు అంటే గావి వీరభధ్ర దేవాలయం వంటివి ఉన్నాయి. అమృత సరోవర్ నీటి సరస్సు, ఉద్యానవన తోటలు వంటివి ఇది ఒక వినోద పర్యటనా స్ధలంగా చేశాయి. ఇక్కడ పేరా గ్లైడింగ్ మరియు సైకిలింగ్ వంటివి కూడా చేయవచ్చు. 

నంది హిల్స్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నంది హిల్స్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నంది హిల్స్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నంది హిల్స్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - ప్రభుత్వ బస్సులు బెంగుళూరు, నందిగ్రామ మరియు చిక్కబల్లాపూర్ ల నుండి నంది హిల్స్ కు చేరుస్తాయి. బెంగుళూరు నుండి రెండు గంటలు, లేదా చిక్కబల్లాపూర్ నుండి ఒక గంట సమయంలో బస్ లపై లేదా ఇతర వాహనాలపై నంది హిల్స్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - నంది హిల్స్ కు రైలు స్టేషన్ లేదు. చిక్కబల్లాపూర్ సమీప రైలు జంక్షన్. ఇది 9 కి.మీ. ల దూరంలో ఉంది. ఇక్కడనుండి టాక్సీలలో నంది హిల్స్ చేరవచ్చు. బెంగుళూరు రైలు స్టేషన్ ప్రధానంగా దేశంలోని అన్ని నగరాలకు కలుపబడి ఉంది. బెంగుళూరు స్టేషన్ నుండి చిక్కబల్లాపూర్ కు రైలు నడుస్తుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నంది హిల్స్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - నంది హిల్స్ కు చేరాలంటే, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలనందిస్తుంది. ఇది నంది హిల్స్ కు 60 కి.మీ. ల దూరంలో ఉంది. ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల పర్యాటకులు దీని సేవలను వినియోగించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu