Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పనాజి » ఆకర్షణలు » అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కన్ సెప్షన్

అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కన్ సెప్షన్, పనాజి

2

గోవాలోని పనాజింలో ఈ చర్చి బాగా పేరు పడిన చర్చి. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పరిశుభ్రంగాను, తెల్లగా ఉండి, ఆకర్షణీయమైన శిల్ప కళా శైలి కలిగి ఉంటుంది.   చర్చిని సమీపించిన వెంటనే అక్కడి పరిశుభ్రమైన వీధులు, చక్కటి కాలినడక బాటలు, చర్చి ప్రవేశంలో వర్జిన్ మేరీ పెద్ద విగ్రహం ఆకర్షణీయంగా కనపడుతూంటాయి. ఈ చర్చి మొదటగా 1541 లో నిర్మించబడింది. కాని 1619 సంవత్సరంలో మరోసారి పునరుద్ధరించబడింది.. అప్పటినుండి అది ఎంతో వైభవంగా శోభిల్లుతోంది.

 బయటి భాగాలతో పోలిస్తే, లోపలి భాగాలు మరింత అందంగా ఉంటాయి. చర్చి ప్రధాన పీఠంలో మేరీ విగ్రహం మరియు దానికి అటూ ఇటూ వేరు వేరు పీఠాలలో జీసస్ క్రీస్తు మరియు అవర్ లేడీ ఆఫ్ రోజరీ ఉంటారు. ప్రధాన భవనంలోనే సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ప్రార్ధనా స్ధలంకూడా ఉంటుంది. ఈ చర్చి పగటి పూట ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాదు, రాత్రులందు దీపపు వెలుగులలో కళ కళ లాడుతూంటుంది. తెల్లటి భవనంపై దీపపు కాంతులు అద్భుతంగా ఉండి పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి. చర్చి చుట్టూ ఉండే ప్రదేశాలు అనేక దుకాణాలు కలిగి పర్యాటకులకు షాపింగ్ అవకాశాలను కల్పిస్తాయి.  అవర్ లేడీ ఆఫ్ ఇమ్మక్యులేట్ కన్ సెప్షన్ కు చేరటం తేలికే. వాస్కో డా గామా, మార్గోవాలనుండి బస్సులు కలవు. నార్త్ గోవా వాసులకు లేదా బాగా, కాలన్ గూటే మరియు కండోలిం ప్రదేశాల వారికి క్యాబ్ పై ప్రయాణించి చేరుకోవటం తేలిక. మీరు ఒక రోజంతా చర్చిలు చూడాలనుకుంటే, అద్దె కారులో అదే సమయంలో దీనిని కూడా దర్శించండి. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Apr,Sun
Return On
06 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
05 Apr,Sun
Check Out
06 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
05 Apr,Sun
Return On
06 Apr,Mon