Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పోర్ బందర్

పోర్ బందర్ - చరిత్ర మొదలైన ప్రదేశం

15

పోర్ బందర్ గుజరాత్ యొక్క ఒక పురాతన ఓడ రేవు పట్టణం. కతిఅబార్ తీరం లో కలదు. ఈ ప్రదేశాన్ని సాధారణంగా అందరూ గాంధీ జన్మించిన ప్రదేశంగా భావిస్తారు.

చరిత్ర

పోర్ బందర్ ను ‘సుధామ పురి ’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం శ్రీ కృష్ణుడి మంచి మిత్రుడు అయిన సుధాముడు జన్మించిన స్థలంగా పురాణాలు చెపుతాయి. ఇక్కడ జరిపిన తవ్వకాలు హరప్పా నాగరికతను వెల్లడించాయి. ఇది సుమారుగా ద్వారక కాలం నాటిదే. 16 వ శతాబ్దం లో పోర్ బందర్ ను జేత్ వా రాజపుత్ర వంశం పాలించింది. మొఘల్ గవర్నర్ అధీనం లో ఈ పట్టణం వుండేది. తర్వాతి కాలంలో ఇది గాయక్వాదులు, పీశ్వాల పాలనలలో వుంది. చివరకు బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది. మొగలులు, పీశ్వాలు, బ్రిటిష్ వారి కింద పోర్ బందర్ ఒక ప్రధాన వాణిజ్య ఓడ రేవుగా ఓడలు ఈస్ట్ ఆఫ్రికా, అరబ్, పెర్షియన్ గల్ఫ్ దేశాలకు ప్రయాణాలు చేసేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కథియవార్ ఐక్య రాష్ట్రం ఒప్పందాల మేరకు పోర్ బందర్ గుజరాత్ రాష్ట్రం లో విలీనం అయింది.

భౌగోళికతలు

పోర్ బందర్ కథియవార్ లో ఒక భాగం. గుజరాత్ కు పడమటి తీరంలో అరేబియన్ సముద్రం పక్కన కలదు. ఈ ప్రదేశం ఒక మైదానం. అందమైన బీచ్ ప్రదేశాలు కొద్ది పాటి బరదా హిల్స్ వంటి కొండ ప్రదేశాలు కలవు. ఒక వైపు అరేబియా సముద్రం మిగిలిన మూడు వైపులా భాన్ వాడ, ఉప్లేతా మరియు కేశోడ్ నగరాలు కలవు.

వాతావరణం

అరేబియా సముద్రం పక్కనే వుండటం చేత వేసవి ఒక మోస్తరు గాను, వింటర్ లు ఆహ్లాదం గాను వుంటాయి. వర్షాకాలంలో వర్షాలు అధికం, పిడుగు పాటులు కూడా వుంటాయి. మొత్తంగా చేప్పాలంటే, సముద్రం పక్కనే కనుక తేమ అధికం.

చేరటం ఎలా ?

పోర్బందర్ కు రోడ్, రైల్, మరియు విమాన సదుపాయాలూ దేశం లోని అన్ని ప్రధాన నగరాలనుండి కలవు. పోర్ బందర్ రైలు స్టేషన్, పోర్ బందర్ ఎయిర్ పోర్ట్ రెండూ కూడా స్థానికం, మరియు అంతర్జాతీయంగా సేవలు అందిస్తాయి. నగరంలో తిరిగేందుకు ప్రభుత్వ బస్సులు , ఆటో రిక్షాలు కలవు.

పోర్ బందర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పోర్ బందర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పోర్ బందర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పోర్ బందర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం పోర్బందర్ సిటీ రాజ్ కోట్ మరియు అహ్మదాబాద్ లకు నేషనల్ హై వే 8 బి ద్వారా కలుపబడి వుంది. ద్వారక, జామ్ నగర్ లకు ఉత్తర దిశలోనూ భావ నగర్, వేర్వాల్ లకు దక్షిణ దిశలో నేషనల్ హై వే 8 ఈ ఎక్స్టెన్షన్ ద్వారా కలుపబడి వుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పోర్ బందర్ పట్టణం రైలు స్టేషన్ దేశం లోని అన్ని ప్రధాన స్టేషన్ లకు కలుపబడి వుంది. ఒఖా, రాజ్ కోట్, ముంబై , భం వాడ లకు ప్రతి రోజూ రైళ్ళు కలవు. ఢిల్లీ, మోతిహారి,హవురా లకు కూడా ట్రైన్ లు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పోర్బందర్ కు కొత్త టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. ప్రతి రోజూ ముంబై కు పోర్బందర్ ఎయిర్ పోర్ట్ నుండి విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue