రాజస్థాన్ లోని షేఖావతి ప్రాంతం లో వున్న పట్టణం ఝుంఝును. అందంగా చిత్రించిన ప్రాసాదాలు అధిక సంఖ్యలో వున్న ఈ పట్టణం బాగా ప్రసిద్ది చెంది౦ది. 18వ శతాబ్దపు ఖేత్రీ మహల్, బిహారీజీ దేవాలయం, మేర్తానీ బావరి ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడి సేథ్ ఈశ్వర్ దాస్ మోహన్ దాస్ మోడీ హవేలీ లోని చిత్రాలు షెఖావతీ ప్రాంతం లో అత్యుత్తమమైనవి గా ప్రసిద్ది పొందాయి.
19వ శతాబ్దానికి చెందిన టిబ్రేవాలా హవేలీ రంగుటద్దాల కిటికీ లకు ప్రసిద్ది. నవాబ్ సమస్ఖాన్ మక్బరా, జోరావార్ ఘర్, ఖేత్రీ మహల్, లక్ష్మీ నాథ దేవాలయం, అజీత్ సాగర్, నవాబ్ రోహిల్లా ఖాన్ మక్బరా ఇక్కడి ఇతర ప్రధాన ఆకర్షణలు.



Click it and Unblock the Notifications