Search
  • Follow NativePlanet
Share

శివగంగ - ట్రెక్కింగ్ ఆసక్తి కలవారికి అద్భుత విహార స్ధలం

15

శివగంగ ట్రెక్కింగ్ చేసేవారికి మంచి ప్రదేశం. ఇది బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక పగటి పూటే ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి రావచ్చు.  

యాత్రికులకు సరైన ప్రదేశం శివగంగ ప్రదేశం ఒక చిన్న కొండ. అక్కడి కొండపైగల శివాలయం కారణంగా ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడే ఒక అందమైన నీటి బుగ్గ కూడా ఉంది. స్ధానికులు ఈ నీటి బుగ్గ గంగానది నుండి వచ్చిందని చెపుతూ దీనికి శివగంగ అని పేరు పెట్టారు. కొండపైనగల శివాలయం దక్షిణ కాశి అనే మారు పేరుతో కూడా చెప్పబడుతుంది.

శివగంగ పట్టణంలో పురాతన గంగాధరేశ్వర దేవాలయం కూడా ఉంది. ఇతిహాసం మేరకు ఇక్కడ ఒక రహస్య సొరంగ మార్గం ఉందని అది బెంగుళూరులోని గావి గంగాధరీశ్వర దేవాలయానికి దోవతీస్తుందని చెపుతారు. అయితే, నేటికీ ఈ సొరంగమార్గం కాన రాలేదు. పాతాళ గంగ దేవాలయంలో  నీటి బుగ్గ భూమినుండి ఆశ్చర్యకరరీతిలో ప్రవహిస్తూంటుంది. నీటి స్ధాయి ఎప్పటికపుడు మారుతూ అదే రీతిలో ఉంటుంది. ఈ కొండపై పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. సాహస క్రీడలు చేయాలనుకునేవారు కొండలు ఎక్కవచ్చు.  డబ్బాస్ పేట, శివగంగకు సమీపంలోని పట్టణం. సుమారు 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బెంగుళూరు నుండి వచ్చేవారు టుంకూరు బస్ ఎక్కాలి అక్కడనుండి మరో బస్ ను డబ్బాస్ పేటకు అందుకోవాలి. డబ్బాస్ పేట నుండి శివగంగకు ప్రయివేట్ వాహనాలు కూడా కలవు.

శివగంగ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శివగంగ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శివగంగ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శివగంగ

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి శివగంగ హిల్స్ కు అనేక ప్రయివేటు, ప్రభుత్వ బస్ లు నడుస్తాయి. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బెంగుళూరు నుండి తరచుగా బస్సులు నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - శివగంగకు రైలు స్టేషన్ లేదు. దీనికి సమీప రైలు స్టేషన్ డాబస్ పేట. ఇది 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బెంగుళూరు మెజెస్టిక్ రైలు స్టేషన్ ప్రధాన రైలు స్టేషన్. ఇక్కడినుండి దేశంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు రైళ్ళు కలవు. శివగంగకు ఇక్కడినుండి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    శివగంగ చేరటం ఎలా? విమాన ప్రయాణం - బెంగుళూరు కు 60 కి.మీ.ల దూరంలోగల శివగంగ హిల్స్ కు చేరాలంటే బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంనుండి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు. ఇది దేశీయ, విదేశీయ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలనుండి, దేశంలోని అన్ని నగరాలనుండి బెంగుళూరు విమానాశ్రయానికి విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Sep,Sun
Return On
07 Sep,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
06 Sep,Sun
Check Out
07 Sep,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
06 Sep,Sun
Return On
07 Sep,Mon