ఈ ప్రాంతం భారత దేశం యొక్క గతాన్ని ఎన్నో విధాలుగా నిర్ధారిస్తుంది. మహా శివుడు పేరుతోనే శివపురి కి పేరు వచ్చింది. శివపురి లో ప్రాచీన భారత దేశానికి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. నగరం లో చోటు చేసుకున్న ఆధునిక మార్పులతో పాటు ప్రాచీన స్మారక కట్టడాలు ,ఆలయాలు ఈ ప్రాంతానికే ప్రత్యేకం. శివపురి నుండి 20 కిలోమీటర్ల దూరం లో ఉన్నసర్వాయ కి గర్హి శివపురి-ఝాన్సీ రోడ్డు కి సమీపం లో ఉన్న చిన్నపట్టణం.
ఈ నగరం యొక్క అందాలని ఇక్కడ ఉన్న అందమైన సరస్సు రెట్టింపు చేస్తుంది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురాతన శివుడి ఆలయం ఈ ప్రాంతం లో ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఇప్పటికీ నిలిచి అందరినీ ఆకట్టుకుంటుందంటే ఆశ్చర్యదగ్గ విషయం. రాతి తో నిర్మించబడిన సమావేశ మందిరం ఇది. గతానికి చెందిన నృత్య ప్రదర్శనల సవ్వడులు ఇంకా సంగీత ప్రదర్శనల రాగాల ప్రతిధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి.



Click it and Unblock the Notifications