Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సియోలిం

సియోలిం - పులులు , సింహాల పూర్వపు నివాసం!

3

సియోలిం ప్రాంతం మాపూసాకు వాయువ్యంగా ఉంటుంది. అంజునా, కాలన్ గూటే మరియు బాగాలకు ఉత్తరంగా ఉంటుంది. సియోలిం బీచ్ నుండి సూర్యోదయ సూర్యాస్తమయాలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సియోలిం అనే పేరుకు తగినట్లు గతంలో ఈ ప్రాంతంలో బహుశ అనేక సింహాలు, పులులు, ప్రత్యేకించి కొండలలో సంచరించి ఉండవచ్చు. ఇది మతపరంగా కేధలిక్కులకు, హిందువులకు కూడా పవిత్ర ప్రదేశం. సీజన్ వచ్చిందంటే చాలామంది యాత్రికులు ఇక్కడి చర్చిలను, దేవాలయాలను దర్శిస్తారు.

సియోలిం చర్చిసెయింట్ ఆంధోనీ, మా డి డూస్, అవర్ లేడీ ఆఫ్ సారోస్ కలిగి ఉంటుంది. శ్రీ దత్త మరియు సతేరి దేవాలయాలు కూడా కలవు. పర్యాటకుల పరంగా సియోలిం చేరాలంటే పెద్ద కష్టమేమీ కాదు. అది మాపూసా, నార్త్ గోవా మరియు పాణిజింలనుండి తేలికగా చేరవచ్చు. ముంబై నుండి ప్రయాణించే పర్యాటకులు గోవా వెళ్ళే దారిలో చూడవచ్చు. సియోలిం అంజునా బీచ్ మరియు కర్లీస్ షాక్ మరియు అంజునా శనివార రాత్రి ఫ్లీ మార్కెట్లకు కూడా సన్నిహితంగా ఉంటుంది.

ఈ ప్రాంతానికి వెగేటర్ మరియు ఛపోరా బీచ్ లు కూడా దగ్గరే. ఛోపడెం ఫిష్ మార్కెట్ కూడా దర్శించవచ్చు. ఇక ఈ ప్రాంత వసతి చాలా తేలికగా దొరుకుతుంది. చిన్న రూముల నుండి 4 స్టార్ లక్జరీ రూమ్ ల వరకు దొరుకుతాయి. పాణజిం లేదా బాగా లనుండి అద్దె కారు లేదా బైక్ లపై కూడా సియోలిం చేరవచ్చు.

సియోలిం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సియోలిం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సియోలిం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సియోలిం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed