హాజర పుఖురి తేజ్ పూర్ నగరంలోని మూడవ అతిపెద్ద నీటి రిజర్వాయర్ లేదా టాంక్. 70 ఎకరాల ప్రాంతంలో విస్తరించివున్న ఈ హాజర పుఖురి నగర గంభీరమైన ఆకర్షణ.
బహుశా 19 వ శతాబ్దపు త్రవ్వకాలలో బైటపడిన ఈ హాజర పుఖురి కి హాజర వర్మన్ పేరు పెట్టబడింది. బ్రహ్మపుత్ర నది చల్లని గాలులతో వేసవి వేడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తే, నగరం లోపల పుఖురి లేదా చెరువులు చల్లని వాతావరణాన్ని జోడించాయి. హాజర పుఖురి వేరువేరు కాదు. దీని భారీ పరిమాణం నగర నివాసితులకు మరింత అందంగా, ఆకర్షణీయంగా చేస్తుంది.
హాజర పుఖురి నగర౦ లోపల ఉన్నది కాబట్టి, పర్యాటకులు సాయంత్రాలు మార్కెట్ లేదా హోటల్ మార్గాలలో సరదాగా నడిచి వెళ్ళవచ్చు. సరస్సు చుట్టూ నడవడం, చల్లని పచ్చిక బయళ్ళపై కూర్చోవడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. పుఖురి లు అస్సాం మొత్తంలో ఉంటాయి, నగరంలో అయితే అవి పెద్ద సంఖ్యలో ఉంటాయి.



Click it and Unblock the Notifications