సెయింట్ జాన్స్ ఆంగ్లికన్ చర్చ్ గా పిలువబడే ఈ ఇంగ్లిష్ చర్చ్ తలసేరి లో బాగా సందర్శించబడే పర్యాటక స్థలాల్లో ఒకటి. 140 సంవత్సరముల కన్నా పురాతనమైన చరిత్ర గల ఈ చర్చి మలబార్ ప్రాంతం లోని మొట్టమొదటి చర్చిల్లో ఒకటిగా భావిస్తారు. తలసేరి కోటకు దగ్గరలో వుండే ఈ చర్చి సందర్శకులకు ఒక అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
ఈ చర్చి పక్కనే వున్న స్మశానంలో మలబార్ ను పాలించిన గొప్ప అధికారుల సమాధులు వున్నాయి. తలసేరి సంక్షేమం కోసం పాటుపడి, తన సంపదను దానికే వెచ్చించిన ఆంగ్ల దాత ఎడ్వర్డ్ బ్రేన్నెన్ సమాధి చరిత్ర ప్రేమికులను ఆకర్షిస్తుంది.ఈ చర్చి నిర్మాణ వైభవం, దాని ప్రాచీనత సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ చర్చిలో లండన్ నుంచి తెప్పించిన అద్భుతమైన గాజు పనితనం అప్పటి ఇంగ్లీష్ వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఇంగ్లిష్ చర్చ్ ని ఈ మధ్యనే పురావస్తు శాఖ వారు పునరుద్ధరించి పర్యాటకుల కోసం తెరిచారు.



Click it and Unblock the Notifications