తీరికగా కాలక్షేపం చేయాలంటే తలసేరి లోని మరో ప్రధాన ఆకర్షణ టాగోర్ పార్క్ సరైన ప్రదేశం. పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో వున్న మహె అనే చిన్న పట్టణం లో ఈ పార్క్ వుంది. ఈ పట్టణం లోని ప్రతి మూలను ప్రభావితం చేసిన ఫ్రెంచ్ వారసత్వ౦ మహె సొంతం. ప్రత్యేకమైన సంస్కృతి, చారిత్రిక వైభవం తో మహె యాత్రికులను అనుభూతి పొంది అన్వేషించమని ఆహ్వానిస్తుంది.
మహె లోని టాగోర్ పార్క్ తలసేరి నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది. ఫ్రెంచి విప్లవ యోధుడు, అనంతర కాలంలో ఫ్రాన్స్ జాతీయ చిహ్నంగా మారిన మరియన్నా శిల్పం ఈ పార్క్ లో వుంది. 1789లో ఫ్రెంచి విప్లవం శత జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ విగ్రహం మీద ‘స్వాతంత్ర్యం, సమానత, సౌభ్రాతృత్వం’ అనే మాటలు చెక్కి వుంటాయి.
టాగోర్ పార్క్ లోపల స్వాతంత్ర్య ఉద్యమ యోధుల స్మారకార్ధ ఒక కట్టడం కూడా నిర్మించారు. ఈ పార్కు ప్రభుత్వ గృహాలకు దగ్గరగా వుండి, చేరుకోవడానికి తేలిగ్గా వుంటుంది.



Click it and Unblock the Notifications