ఇక్కడ జరిగే ప్రత్యెక పండుగల వల్ల ఎంతో మంది పర్యాటకులు సందర్శించే ధార్మిక స్థలం వామిల్ దేవాలయం. తలసేరి నుంచి కన్నూర్ పట్టణానికి వెళ్ళే దారిలో ఈ గుడి ని సందర్శించవచ్చు.
మలబార్ దేవాలయాల్లో జరిగే తెయ్యం అనే సంప్రదాయ నృత్యానికి ప్రసిద్ది పొందిన ఈ గుడిని సందర్శకులు విరివిగా దర్శిస్తారు. ఈ నృత్యాన్ని వామిల్ దేవాలయం లో నిత్యం ప్రదర్శిస్తారు. వర్ణమయంగా ఎంతో ఉత్సాహంతో, దైవకళ గా భావించే ఈ ప్రదర్శన జరిగేటప్పుడు యాత్రికులను అనుమతిస్తారు. ప్రతిరోజూ 12.30కు అరగంట పాటు జరిగే ఈ నృత్యానికి వామిల్ దేవాలయం వేదికౌతుంది.
దైవ కళా రూపాలను, వర్ణమయ మలబార్ దేవాలయ ఉత్సవాలను చూడాలనుకునే యాత్రికులకు వామిల్ దేవాలయం ఎంతో ఆనందాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications