Search
  • Follow NativePlanet
Share
» »అలప్పూజ అందాలను దోసిళ్లతో పట్టుకోవడానికి వెలుదాం

అలప్పూజ అందాలను దోసిళ్లతో పట్టుకోవడానికి వెలుదాం

అలప్పూజ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

కేరళ సహజ అందాలకు నిలయం. అందువల్లే ఒక్క దక్షిణ భారత దేశం నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకలు వస్తుంటారు. అటువంటి కేరళలో అలప్పూజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ప్రకృతితో మమేకం కావాలనుకునేవారు ఎవరూ అలప్పూజను సందర్శించకుండా ఉండలేరు. మంత్రముగ్దులను చేసే బ్యాక్ వాటర్, సుందరమైన కాలువలు, వరి పొలాలు ఈ అలప్పూజకు ప్రత్యేక అందాలను తీసుకొస్తున్నాయి.

అందువల్లే అలప్పూజను తూర్పు వెనిస్ అని అంటారు. ఇక్కడ బీచ్ లు , సరస్సుతో పాటు మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన వివరలు మీ కోసం...

కుట్టినాడ్

కుట్టినాడ్

P.C: You Tube

కుట్టినాడ్ ఒక సహజ నీటి ఆవాస కేంద్రం. ఇక్కడ బోట్ హౌస్ లలో ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీకు సమయం ఉంటే ఆ గూటిపడవల్లో కుట్టినాడ్ లో దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ప్రక`తిలో మమేకం కావచ్చు. అయితే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బోట్ హౌస్ కోసం ముందుగా బుక్ చేసుకోవడం మంచిది. పౌర్ణమి రోజుల్లో బోట్ హౌస్ లో నదీ జలాల్లో విహరించాలంటే కుట్టినాడ్ కు మించిన స్థలం మరెక్కడా లేదని చెప్పవచ్చు.

మరారి బీచ్

మరారి బీచ్

P.C: You Tube

అలప్పూజ దగ్గరగా ఉన్న మరో పర్యటక ప్రాంతం మరారీ బీచ్. ఇక్కడకు దగ్గరగా ఉన్న రిసార్టులు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. సంప్రదాయ కేరళ వంటకాలతో పాటు ఇండియా, కాంటినెంటల్, చైనీస్ వంటి వంటకాలను కూడా ఇక్కడ రుచి చూడవచ్చు. ఇక్కడ కేరళ ఆయుర్వేద క్లీనిక్ లు కూడా చాలా ఉంటాయి. చాలా మంది ఆయుర్వేద బాడీ మసాజ్ కోసం ఇక్కడికే వస్తారు.

వాంబనాడ్ లేక్

వాంబనాడ్ లేక్

P.C: You Tube

కేరళలో అతి పొడవైన, అతి విశాలమైన సరస్సు వాంబనాడ్ సరస్సు. అనేక సరస్సుల కలయిక వల్ల వాంబనాడ్ లేక్ ఏర్పడింది. అందువల్లే ఈ సరస్సులో ఎప్పుడూ ఒకే రకమైన నీటి మట్టం ఉంటుంది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కేరళ వాసులు చాలా బాగా జరుపుకొనే ఓనం పండుగ సమయంలో ఇక్కడ జరిగే పడవ పోటీలు చాలా ప్రాచూర్యం చెందినవి. ఈ పడవ పోటీలను చూడటానికే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ అప్పుడే పట్టిన చేపలతో చేసే వంటకాలు చాలా బాగుంటాయి.

అలప్పే బీచ్

అలప్పే బీచ్

P.C: You Tube

కేరళలోనే కాకుండా భారత దేశంలోనే అత్యంత సుందరమైన బీచ్ గా అలప్పే బీచ్ కు పేరుంది. అందువల్లే కేరళలో ఎక్కువ మంది సందర్శించే పర్యాటక కేంద్రాల జాబితాలో దీని పేరు తప్పకుండా ఉంటుంది. ఈ బీచ్ లో మనం దాదాపు 137 ఏళ్ల క్రితం నిర్మించిన గోడను కూడా చూడవచ్చు. అంతేకాకుండా అతి ప్రాచీనమైన లైట్ హౌస్, పామ్ చెట్లు ఈ బీచ్ అందాలను రెట్టింపు చేస్తాయి.

పతిరమనాల్

పతిరమనాల్

P.C: You Tube

వాంబనాడ్కు దగ్గరగానే పతిరమనాల్ అనే ద్వీపం ఉంటుంది. పక్షుల కిలకిల రావాలు, చుట్టూ పచ్చటి మైదానాలను చూస్తూ ఈ ద్వీపంలో సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు. పక్షి ప్రేమికులు ఎక్కువగా ఈ ద్వీపానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X