Search
  • Follow NativePlanet
Share
» »ఓర్వకల్: అబ్బురపరిచే రాతి శిలలు !

ఓర్వకల్: అబ్బురపరిచే రాతి శిలలు !

By Mohammad

ఓర్వకల్లు (ఓర్వకల్) మండలంలో పర్యాటకులను అబ్బురపరిచే పర్యాటక ప్రదేశాలు కేతవరం కొండలు, ఓర్వకల్ రాక్ గార్డెన్. జిల్లా ప్రధాన కేంద్రం అయిన కర్నూల్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో కలదు. కర్నూల్ నుండి నంద్యాల కు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో(NH 18) కనిపిస్తుంది. రోడ్డుకి ఇరువైపులా విచిత్రమైన రాతి సంపదను కలదు.

రాతి శిలల నిర్మాణాలు

రాతి శిలల నిర్మాణాలు

చిత్ర కృప : Balamurugan Natarajan

ఓర్వకల్ రాక్ గార్డెన్

ఓర్వకల్ రాక్ గార్డెన్ జాతీయరహదారిని అనుకోని సులభంగా చేరుకొనే విధంగా ఉంటుంది. ఓర్వకల్ మండలానికి వెలుప ఉన్న ఈ రాక్ గార్డెన్ లో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం మరియు పిక్నిక్ స్థలాలు, వసతి కై హరితా రిసార్ట్ ఉన్నాయి. గాజుపరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా వంటి ముడిపదార్ధాలతో ఇక్కడి రాతి శిలలు ఏర్పడ్డాయి. ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవే !

APTDC ఆధ్వర్యంలో నడుస్తున్న రెస్టారెంట్

APTDC ఆధ్వర్యంలో నడుస్తున్న రెస్టారెంట్

చిత్ర కృప : Sanju189

ఓర్వకల్ రాక్ గార్డెన్ లో సినిమా షూటింగ్ లు కూడా నిర్వహిస్తుంటారు. ఇప్పటివరకు జయంమనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్ర బోస్, శంభో శివ శంభో, బాహుబలి వంటి సినిమాలు చిత్రీకరించారు.

ఓర్వకల్ రాక్ గార్డెన్ లో చూడవలసిన మరో స్థలం డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్. ఇక్కడ నిలబడి పక్షుల శబ్దాలను, కిలకిలారావాలు, విహారాలు గమనించవచ్చు. లోయలు, కొండలు, నీటి ప్రవాహాలు, అబ్బురపరిచే రాతి దృశ్యాలు, అవి ఏర్పడ్డ తీరు ఇవన్నీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

చిత్ర విచిత్ర రాతి దృశ్యాలు

చిత్ర విచిత్ర రాతి దృశ్యాలు

చిత్ర కృప : Poreddy Sagar

రాక్ గార్డెన్ సందర్శించు సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

మతపర ప్రదేశాలు

ఓర్వకల్ లో మతపరమైన ప్రదేశాలు కలవు. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశ్వర స్వామి ఆలయం, శ్రీమాతా చౌడేశ్వరి దేవి ఆలయం, సూఫీ హజరత్ సయ్యద్ మహమ్మద్ షా ఖాద్రి దర్గా లు చూడదగ్గవి. ప్రతి సంవత్సరం ఆలయాల వద్ద ఉత్సవాలు, తిరునాల నిర్వహిస్తారు. దర్గా వద్ద శివరాత్రి తర్వాత ఉరుసు జరుగుతుంది.

చెన్నకేశ్వర స్వామి ఆలయం, ఓర్వకల్

చెన్నకేశ్వర స్వామి ఆలయం, ఓర్వకల్

చిత్ర కృప : Kishore Nagarigari

కేతవరం కొండలు

పర్యాటకులను అబ్బురపరిచే కేతవరం కొండలు పదివేల ఏళ్లనాటి ఆదిమానవుని లిపి, బొమ్మలు, చిహ్నాలు ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామం కొండలపై కనిపిస్తాయి. క్రీస్తుకుపూర్వం 8 వేల ఏళ్లకింద ఇక్కడ ఆదిమానవులు సంచారం చేసిన ఆనవాళ్లు వున్నాయి.

కేతవరం రాతి గుహలు - లోపలి భాగం

కేతవరం రాతి గుహలు - లోపలి భాగం

ఆదిమానవుని జీవిత విశేషాలు, ఆచార వ్యవహారాలు, లిపివర్ణ చిత్రాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్లే దారిలో పూడిచెర్ల మీదుగా కేతవరం వెళ్లవచ్చు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తున్నారు.

ఓర్వకల్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

ఓర్వకల్ చేరుకోవటానికి సమీపాన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(236 KM ) కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు మాట్లాడుకొని ఓర్వకల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఓర్వకల్ కు సమీపాన కర్నూల్ రైల్వే స్టేషన్ (25 KM) కలదు. స్టేషన్ బయట ఆటో (లింక్ రూ. 10/-) ఎక్కి బస్ స్టాండ్ చేరుకొని, నంద్యాల కు లేదా బనగానపల్లె కు వెళ్లే పల్లెవెలుగు(ఇప్పుడు తెలుగు వెలుగు), ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కితే ఓర్వకల్ చేరుకోవచ్చు. ఓర్వకల్ కు సమీపాన ఉన్న నంద్యాల రైల్వే స్టేషన్ ( 50 KM ) సమీపంలో ఉన్న మరొక రైల్వే స్టేషన్.

కర్నూలు రైల్వే స్టేషన్

కర్నూలు రైల్వే స్టేషన్

చిత్ర కృప : indiarailinfo

బస్సు / రోడ్డు మార్గం

కర్నూల్ నుండి ఓర్వకల్ కు తరచూ ప్రతి అరగంట కొకసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. నంద్యాల నుండి కర్నూల్ వెళ్లే బస్సులు ఓర్వకల్ లో ఆగుతాయి. ఓర్వకల్ రాక్ గార్డెన్ కూడా స్టాప్ ఉంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+