Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలున్న ఈ బాల బాలజీ ఆలయాన్ని దర్శిస్తే..

తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలున్న ఈ బాల బాలజీ ఆలయాన్ని దర్శిస్తే..

వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్ర ప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతి లో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు.

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలు కలిగిన ఆలయాలు మరో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ద్వారకా తిరుమల ఉండగా, మరొకటి తూర్పు గోదావరి కి చెందిన అప్పనపల్లి లో ఉన్నది. విశేషం ఏమిటంటే రెండు ఆలయాలు కూడా ఉభయగోదావరి జిల్లా లో ఉండటం.

తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు

తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు

తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు పై రెండు ఆలయాలను దర్శిస్తే సకలశుభాలు, శుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.ఇదివరకు మనం ద్వారకా తిరుమల గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు తూర్పుగోదావారి జిల్లాలోని అప్పనపల్లిలో ఉన్న శ్రీ బాలబాలజీ దేవాలయం గురించి తెలుసుకుందాం..

పెద్ద తిరుపతి , చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా

పెద్ద తిరుపతి , చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా

పెద్ద తిరుపతి , చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా. దీనికి సమాధానం వైనతేయ నదీ తీరం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కలదు. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నాన మాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు.

ఆలయ విశిష్టత

ఆలయ విశిష్టత

భగవంతుడు తనని దర్శించడానికి వచ్చి ఇబ్బందులు పడుతున్న వారినే కాదు, చూడాలని ఉన్నా రాలేకపోయిన వారికోసం కూడా మరింత తాపత్రయపడుతుంటాడు. అవసరమైతే తన భక్తుల గ్రామాలకి తానే తరలిపోతుంటాడు. అలా ఆ శ్రీనివాసుడు తన భక్తుడి కోసం తరలి వచ్చిన క్షేత్రమే ‘అప్పనపల్లి’. మహిమాన్వితమైన ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి సమీపాన గోదావరి తీరాన విలసిల్లుతోంది.

ఆలయ విశిష్టత

ఆలయ విశిష్టత

ప్రాచీన కాలంలో అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదభ్యసానికి, ఆధ్యాత్మికతకు కొలువైన నిలయం. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది. స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే పూజ కార్యక్రమాలు, ఎంతో విశేషంగా ఉంటాయి.

 పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు

పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు

ఇక ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు రామస్వామి అనే భక్తుడు. ఆయన ఈ గ్రామంలో కొబ్బరి కాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలలో కొంత మొత్తాన్ని స్వామికి కేటాయిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. వయస్సు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్ళలేక ఆవేదన చెందాడు. దాంతో త్వరలో తానే ఆ గ్రామానికి వస్తున్నట్లుగా శ్రీనివాసుడు కలలో ఆయనకి చెప్పాడు.

 స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం

స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం

దాంతో రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు. తన కొబ్బరికాయలను దుకాణంలోనే స్వామివారి నిలువెత్తు చిత్రపటం ఉంచి పూజించడం మొదలు పెట్టాడు. ఆ చిత్రపటం నేటికీ ఆలయంలోని ప్రత్యేక మందరిలో దర్శనమిస్తుంది. స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం 1960లో జరిగింది. ఈ ఆలయానికి 1960లో బీజం పడింది.1960 నుంచి 1980 వరకూ ఈ ఆలయ నిర్వహణ రామస్వామి ఆధ్వర్యంలోనే సాగింది.

నూతన ఆలయ నిర్మాణం :

నూతన ఆలయ నిర్మాణం :

పాత ఆల యాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో కొంతస్థలం కొనుగోలు చేసి నూతన ఆలయ నిర్మాణానికి రామస్వామి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 1970 మార్చి18న శంకుస్థాపన చేశారు. 1991 జూలై 4న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయానికి మూలవిరాట్టును ఉచితంగా అందించింది. ఈ ఆలయంలో పద్మావతి, ఆండాళ్‌ తాయార్‌, గరుడాళ్వార్‌ విగ్రహాలను శ్రీమాన్‌ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి నూతన ఆలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి దేవస్థానం అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఆలయ గోపురం..

ఆలయ గోపురం..

ప్రాకారలపై ఎటు చూసినా పురాణ సంబంధమూన దృశ్యాలతో కూడిన వివిధ దేవతా ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. గర్భాలయంలో స్వామి బాల బాలాజీగా కొలువై ఉంటాడు. ప్రత్యేక మందిరాలలో పద్మావతి దేవి ఆండాల్ అమ్మవారు పూజలు అందుకుంటుంటారు. అప్పనపల్లి వేకంటేశ్వరుడు అమ్మకన్నా సున్నితమైన మనస్సున్న వాడనీ, కోరిన వరాలను అప్యాయంగా అందిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

జ్యేష్ట మాసంలో అయిదురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు

జ్యేష్ట మాసంలో అయిదురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు

వివిధ పర్వదినాల్లోనూ జ్యేష్ట మాసంలో అయిదురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకి గానూ భక్తులు విశేషసంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతుంటారు. ఈ దేవస్థానంలో వసతిసత్రాలు, నిత్యాన్నదానం, కల్యాణ మండ పాలు, యాత్రికులకు కావాల్సిన అన్ని సదుపాయాలూ సమ కూర్చారు. కోనసీమలో చాలామంది వివాహాలు ఈ ఆలయం లోనే జరుపుకుంటారు.

అప్పనపల్లి దేవాలయం మూడువైపులా గోదావరి నదితో, మరోవైపు

అప్పనపల్లి దేవాలయం మూడువైపులా గోదావరి నదితో, మరోవైపు

అప్పనపల్లి దేవాలయం మూడువైపులా గోదావరి నదితో, మరోవైపు బంగాళాఖాతం సముద్రంతో చుట్టబడి ఉంటుంది. చుట్టూ అందమైన పంట పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, తాటి చెట్లు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి. శ్రీ బాల బాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని, అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లి ని దర్శించి పునీతులవుతున్నారని యాత్రికుల విశ్వాసం.

శ్రీబాలబాలాజీ ఆలయానికి సమీపంలో

శ్రీబాలబాలాజీ ఆలయానికి సమీపంలో

శ్రీబాలబాలాజీ ఆలయానికి సమీపంలో పురాతన అన్నపూర్ణ కాశీవిశ్వేశ్వరాలయం, ద్వాదశ జ్యోతి ర్లింగాల ప్రాముఖ్యత తెలిపే స్తూపంతో ప్రాచుర్యం పొం దాయి. గ్రామ దేవత కనక మహాలక్ష్మి ఆలయాలు సర్వాంగ సుందరంగా ఆధునీకరించారు. శ్రీబాల బాలాజీ దర్శనానికి వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాలు సందర్శిస్తుంటారు.

అప్పనల్లికి ఎలా వెళ్లాలి?

అప్పనల్లికి ఎలా వెళ్లాలి?

రోడ్డు మార్గం : అప్పనపల్లి కాకినాడ కు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 85 కి. మీ ల దూరంలో మరియు అమలాపురం కు 35 కి. మీ ల దూరంలో కలదు. కాకినాడ నుండి నిత్యం ఒక ప్రభుత్వ బస్సు అప్పనపల్లి వరకు (కాకినాడ వయా యానాం మరియు బోడసకుర్రు మీదుగా) నడుస్తుంది. అలాగే కాకినాడ నుండి రేవులపాలెం మీదుగా (110 కి.మీ) కూడా అప్పనపల్లి చేరుకోవచ్చు.
చిత్ర కృప : apasar

అమలాపురం మీదుగా వచ్చే వారు వయా అంబాజీపేట మీదుగా 35 కి. మీ ల దూరం ప్రయాణించి అప్పనపల్లి చేరుకోవచ్చు. అన్నట్లు ఫెర్రీ సౌకర్యం కూడా ఉన్నది. అమలాపురం నుండి బోడసకుర్రు ఫెర్రి ఎక్కి 13 కి. మీ దూరంలో ఉన్న అప్పనపల్లి చేరుకోవచ్చు.
చిత్ర కృప : InternationalMissions

రైలు మార్గం: అప్పనపల్లికి 35కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు రైల్వేస్టేషన్ అతి సమీపంలో ఉంది.

విమాన మార్గం : ఈ దేవాలయానికి చేరుకోవాలంటే అతి సమీపంలోని డిమొస్టిక్ ఎయిర్ పోర్ట్ రాజమండ్రి . ఇది 84కిలోమీటర్ల దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X