Search
  • Follow NativePlanet
Share
» »కిషన్‌ఘర్‌ -చలువ రాతి నగరం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

కిషన్‌ఘర్‌ -చలువ రాతి నగరం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

కిషన్ గఢ్ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో కలదు. జోధ్ పూర్ ను పాలించిన కిషన్ సింగ్ రాజు ఈ నగరానికి ఆ పేరుపెట్టారు. అజ్మీర్ కు వాయువ్య దిశాన 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 'మార్బుల్ నగరం' గా కిషన్ గఢ్ ఖ్యాతి గడించింది. కిషన్ గఢ్ ప్రస్తుతం గొప్ప పర్యాటక ప్రదేశంగా మారిపోయి, మనోహర దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. వాటిలో పూల్ మహల్ ప్యాలెస్, రూపంగర్ ఫోర్ట్, కిషన్ గఢ్ ఫోర్ట్ ముఖ్యమైనవి.

కిషన్ గఢ్ లో బాణీ థాని అనబడే ప్రత్యేకమైన ప్రముఖ చిత్ర కళా శైలి ఉద్భవించింది. ఈ శైలిలో ఎక్కువగా పచ్చటి రంగులను ఉపయోగిస్తారు, ఎందుకంటే వీరు పచ్చని ప్రకృతికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కనుక. మార్బుల్ తయారీకే కాకుండా, కిషన్ గఢ్ ఇంకో దానికి ప్రసిద్ధి చెందినది. ప్రపంచం మొత్తం మీద 'నవగ్రహ ఆలయం' నిర్మించిన ఏకైక నగరం గా కిషన్ గఢ్ కు ప్రత్యేకత ఉన్నది.

పూల్ మహల్

పూల్ మహల్

నగరానికి నడిబొడ్డున ఉన్న పూల్ మహల్ 1870 లో నిర్మించబడింది. కిషన్ గర్ మహారాజు రాజ మందిరంగా మహల్ ను ఉపయోగించేవాడు. ప్రస్తుతం పర్యాటకుల కోసం అత్యాధునిక విలాసవంతమైన వసతులతో, సౌకర్యాలతో హోటల్ గా తీర్చిదిద్దారు. హోటల్ లోని ప్రతి గది ఎంతో అందంగా ముస్తాబు చేయబడి ఉంటుంది. చిత్ర లేఖనాలు, రాచరికపు వస్తువులు, బ్రిటీష్ ఫర్నీచర్ మొదలైనవి పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. భారతీయ, చైనీస్, ఇటాలియన్ మరియు ఇతర పాశ్చాత్య దేశాల వంటకాలను రుచి చూడవచ్చు.

పూల్ మహల్

పూల్ మహల్

మహల్ బయట జాగింగ్ ట్రాక్ లు, లైబ్రెరీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. చూడముచ్చటైన గార్డెన్, అందులో నిర్మించిన మానవ నిర్మిత సరస్సు ప్యాలెస్ అందాలకు తార్కాణాలు. ఔత్సాహికులు కోరుకుంటే యోగా తరగతులు, రాజస్థానీ సంగీత, నృత్య కళలు ఏర్పాటుచేస్తారు

రూపంగర్ ఫోర్ట్

రూపంగర్ ఫోర్ట్

క్రీ. శ . 1648 లో రూప్ సింగ్ మహారాజు రూపంగర్ ఫోర్ట్ నిర్మించారు. ప్రస్తుతం, పర్యాటకులకు ఒక హెరిటేజ్ హోటల్ గా సేవలందిస్తున్నది. చరిత్ర మీద ఆసక్తి గలవారికి రూపం ఫోర్ట్ తప్పక నచ్చుతుంది. కోట ను పాలరాతి రాళ్లు, రాజస్థాన్ రాళ్ల ను ఉపయోగించి రాజస్థాన్ శైలి లో నిర్మించారు.
హోటల్ లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.నోరూరించే వంటకాలు,ఇంటర్నెట్ సౌకర్యం,కనువిందు చేసే కళాప్రదర్శన,లైబ్రెరీ మొదలైనవి.

కిషన్ గఢ్ ఫోర్ట్

కిషన్ గఢ్ ఫోర్ట్

చారిత్రిక ప్రాధాన్యం కలిగిన కిషన్ గర్ ఫోర్ట్ జై సల్మేర్ బల్జ్ లో ఉంది. రాథోర్ రాజ వంశీకులు ఈ కోటని నిర్మించినట్టు చెబుతారు. శతాబ్దాల క్రితం నిర్మించబడ్డ ఈ కోట భారత దేశం యొక్క నిర్మాణ కళ ల కి ఒక ఉదాహరణ. ఈ కోట కి వ్యూహాత్మక ప్రాముఖ్యత వుంది. ఇండియా, పాకిస్తాన్ ని కలిపే రోడ్డులో ఈ కోట ఉంది. చరిత్ర మరియు పురాతత్వ శాస్త్రం గురించి ఆసక్తి కలిగిన పర్యాటకులకి కిషన్ గర్ ఫోర్ట్ ప్రధాన పర్యాటక ఆకర్షణ గా పేర్కొనవచ్చు.

అజ్మీర్:

అజ్మీర్:

రాజస్థాన్ రాష్ట్రంలోని ఐదో అతి పెద్ద అజ్మీర్ జిల్లాలో, రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. దీన్ని పూర్వం అజ్మీరీ లేదా అజయ్ మేరు అని పిలిచేవారు. ఈ ఊరికి రెండువైపులా ఆరావళి పర్వతాలు ఉన్నాయి. దేశంలోని పురాతన కోటల్లో ఒకటైన తారాఘర్ కోట అజ్మీర్ నగరాన్ని కాపాడుతోంది.ఈ నగరాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో అజయరాజ్ సింగ్ చౌహాన్ స్థాపించాడు. దీన్ని చాలా కాలం పాటు చౌహాన్ వంశీయులు పరిపాలించారు, వారిలో పృధ్వీ రాజ్ చౌహాన్ సుప్రసిద్ధుడు.

చిత్తోర్ గర్ :

చిత్తోర్ గర్ :

రాజస్తాన్ లో 700 ఎకరాలలో విస్తరించి ఉన్నచిత్తోర్ ఘడ్, బ్రహ్మాండమైన కోటలు, దేవాలయాలు, బురుజులు, రాజప్రాసాదాలకు ప్రసిద్ది చెందింది.ఈ నగర యోధుల వీర గాధలకు భారతదేశ చరిత్రలో ఒక గౌరవ నీయ స్థాన౦ ఉంది. ఒక జానపద కథ ప్రకారం మహాభారతంలోని పాండవులలో ముఖ్యుడైన భీముడు, ఒక సాధువు నుండి అమరత్వరహస్యాలను తెలుసుకొనేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడు. కాని అసహనం కారణంగా అతని ప్రయత్నం సఫలం కాలేదు. చిరాకు, కోపంతో అతను భూమిపై తన కాలితో బలంగా మోదడం వలన ఈ ప్రాంతంలో ఏర్పడిన ఒక నీటి జలాశయాన్ని ‘బీం లాట్' అంటారు.

టోంక్:

టోంక్:

రాజస్థాన్ లోని టో౦క్ జిల్లాలో బనస్ నది ఒడ్డున వున్న పట్టణం టోంక్. భారత స్వాతంత్ర్యానికి ముందు వరకు రాచరిక రాష్ట్రమైన ఈ పట్టణాన్ని వివిధ రాజవంశాలు పాలించాయి. ఇది జై పూర్ నుండి 95 కి.మీ. దూరంలో ఉంది. టో౦క్ లో చూడవలసిన అద్భుతాలు చాల ఉన్నాయి.టో౦క్ పట్టణం ఈ ప్రాంతం లో గల చారిత్రిక కట్టడాల ద్వారా గత చరిత్ర కు చెందిన కథలను వివరిస్తుంది. ఈ పట్టణం లోను పరిసర ప్రాంతాలలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

అలంకరించిన కోటలు, అద్భుతమైన రాజప్రాసాదాలూ, స్తంభాలూ, కోష్టాలతో

అలంకరించిన కోటలు, అద్భుతమైన రాజప్రాసాదాలూ, స్తంభాలూ, కోష్టాలతో

రాజస్థాన్ లోని హడోటీ ప్రాంతం లో కోట నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వుంది బుండీ. అలంకరించిన కోటలు, అద్భుతమైన రాజప్రాసాదాలూ, స్తంభాలూ, కోష్టాలతో అందంగా చెక్కిన రాజపుత్ర నిర్మాణ శైలి ఈ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దాయి. ప్రవహించే నదులు, సరస్సులు, ఊపిరి బిగపట్టే జలపాతాలూ ఈ ప్రాంతం అందానికి మరింత శోభనిస్తాయి. బుండీ లోని సింహభాగం పచ్చటి అడవులతో కప్పబడి ఉంది, అరుదైన ఫల, జంతు జాతులకు ఆలవాలంగా ఉంది. అనేకమంది చిత్రకారులు, రచయితలూ, కళాకారులకు బుండి ప్రేరణగా నిలిచింది. రడ్యార్డ్ కిప్లింగ్ కూడా తన ‘కిమ్' ను సృష్టించడానికి ఇక్కడే ప్రేరణ పొందాడు.

కిషన్ గఢ్ ఎలా చేరుకోవాలి ?

కిషన్ గఢ్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం ద్వారా : కిషన్ గఢ్ కు సమీపాన జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం ద్వారా : 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మీర్ రైల్వే స్టేషన్

రోడ్డు మార్గం ద్వారా : ఆగ్రా, బికానెర్, జోధ్ పూర్, జైసల్మీర్, భరత్పూర్,అజ్మీర్, జైపూర్ ల నుండి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సుల ద్వారా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X