Search
  • Follow NativePlanet
Share
» »జముయి - మహాభారత కాలానికి చెందినది !!

జముయి - మహాభారత కాలానికి చెందినది !!

పురాణాల ప్రకారం, జమూయి అనే పేరు “జ్రిభికగ్రం” లేదా “జమ్భియాగ్రం” నుండి ఉద్భవించింది – ఈ గ్రామం మహావీరుడు దైవజ్ఞానం లేదా కైవల్యజ్ఞానాన్ని పొందింది ఇక్కడే అని చెప్పబడింది.

By Mohammad

జైముయి చరిత్ర ప్రాధాన్యత మరియు పురాణ ప్రాధాన్యత సంతరించుకొన్న ప్రదేశం. ఇది బీహార్ రాష్ట్రంలో ఒక జిల్లా గా ఉన్నది. ఇది మహాభారత కాలంలో వెలుగులోకి వచ్చింది. జమూయి పర్యాటకం సందర్శనకు విలువైనదిగా చెప్పడానికి మరో కారణం ఉంది, పురాణాల ప్రకారం, జమూయి అనే పేరు "జ్రిభికగ్రం" లేదా "జమ్భియాగ్రం" నుండి ఉద్భవించింది - ఈ గ్రామం మహావీరుడు దైవజ్ఞానం లేదా కైవల్యజ్ఞానాన్ని పొందింది ఇక్కడే అని చెప్పబడింది.

ఇది కూడా చదవండి : రోహతాస్ - చరిత్రను గుర్తుకు తెచ్చే ప్రదేశం !

జైముయి ప్రాంతం సంగీతం, సాహిత్యం మరియు కళారంగానికి ప్రసిద్ధి చెందినది. పట్టణంలో మరియు దాని చుట్టుప్రక్కల చరిత్ర ప్రాధ్యానత సంతరించుకున్న ప్రదేశాలు, పురాణ ప్రాధాన్యత గల అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అత్యంత చెప్పుకోదగ్గ ప్రదేశాలు ఇవి ....

చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయం

చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయం

పేరుకు తగ్గట్టుగా, 1983, మార్చ్ 16 న స్థాపించిన ఈ చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయానికి చంద్రశేఖర్ పేరు పెట్టారు. ఈ మ్యూజియం గొప్ప పురావస్తు ప్రాధాన్యత కలిగిన, ఇతర 178 విలువైన వస్తువుల కొన్ని పురాతన సేకరణలకు పేరుగాంచింది.

చిత్రకృప : Photo Dharma

కామ్నా లింగం

కామ్నా లింగం

పట్నేశ్వర్ మందిరం, జమూయి లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో, 2 అడుగుల మట్టి గోడ ఈ శివలింగం చుట్టూ ఏర్పడుతుంది, దానిపై కొన్ని లీటర్ల పాలు పోస్తారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎన్ని పాలు పోసినా ఈ శివలింగం కరగదు. దీనిని కామ్నా లింగం అని కూడా అంటారు.

చిత్రకృప : Keymaker31

సిముల్తల్ల హిల్ స్టేషన్

సిముల్తల్ల హిల్ స్టేషన్

సిముల్తల్ల హిల్ స్టేషన్ దాని అద్భుతమైన అందానికి, ఆహ్లాదకర వాతావరణానికి ప్రధానంగా పేరుగాంచింది. మీ హడావిడి జీవిత౦ నుండి కొద్ది సమయం దూరంగా ఉండడానికి ఇక్కడి గొప్ప భూభాగం, అందమైన అబ్బురపరిచే ఈ ప్రాంత సహజ అందాలూ మిమ్మల్ని పిలుస్తాయి.

చిత్రకృప : juggadery

విశ్రాంత మందిరం

విశ్రాంత మందిరం

జైన్ మందిరం ధర్మశాల, జైన యాత్రీకులకు అతిపెద్ద విశ్రాంత మందిరంగా ప్రధానంగా పేరుగాంచింది. జమూయి జిల్లాలోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటైన క్షత్రియ గ్రామ కుండ్ దారిపై ఉన్న ఈ ప్రదేశాన్ని ఎవరైనా ఎపుడైనా సందర్శించవచ్చు. ఈ విశ్రాంత మందిరం లోపల ఒక పెద్ద మహావీర్ ఆలయం ఉంది.

చిత్రకృప : Photo Dharma

అమరత్ షరీఫ్

అమరత్ షరీఫ్

గిద్దేశ్వర్ ఆలయం స్థానికంగా శివాలయంగా పేరుగాంచింది. ఈ ప్రదేశం జమూయి కి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన ఈ శివాలయం ఎత్తైన బండరాళ్లపై ఉంది. శివరాత్రి, మాఘ పౌర్ణమి రోజు ఈ ప్రదేశం భక్తులతో నిండి ఉంటుంది. హజ్రత్ ఖాన్ గాజి దర్గా, జమూయి కి సమీపంలోని అమరత్ షరీఫ్ లో ఉంది.

చిత్రకృప : David Stanley

కుమార్ గ్రామ్

కుమార్ గ్రామ్

కుమార్ గ్రామ్ లో నేతుల తాన్ అనికూడా పిలువబడే పురాతన దేవీ ఆలయం ఉంది. ఇది హిందువులు అదేవిధంగా జైనులకు కూడా యాత్రాస్థలం. దీని ప్రధాన ప్రదేశం సికంద్ర విభాగం లో ఉంది.

చిత్రకృప : Bnkkhan

క్షత్రియ కుండ్ గ్రామ్

క్షత్రియ కుండ్ గ్రామ్

క్షత్రియ కుండ్ గ్రామ్ 24 వ జైనమత తీర్థంకరుడు లార్డ్ మహావీరుడి జన్మస్థలంగా గౌరవించబడింది. ఇక్కడ సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో మహావీర్ ఆలయం ఒకటి. ఈ ఆలయం తోపాటు ఇక్కడ ఈ గ్రామానికి దక్షిణ౦లో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చుఅర్ అనే అందమైన ప్రదేశం ఉంది.

చిత్రకృప : Caupsingh

కాళి మేళా

కాళి మేళా

కాళి మందిరం, జమూయి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం ఇక్కడ జరిగే పెద్ద ఉత్సవానికి ముఖ్యంగా పేరుగాంచింది. ఈ ఉత్సవాన్ని కాళి మేళా అనికూడా అంటారు.

చిత్రకృప : Skmishraindia

సుగ్గి

సుగ్గి

సుగ్గి కాయిస్తా కుటుంబానికి నివాసం. ఇది జుముయి నుండి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం ఇక్కడ ఉన్న శివ మందిరం, దుర్గ మందిరానికి ప్రధానంగా పేరుగాంచింది.

చిత్రకృప : Svarya

మింటో టవర్

మింటో టవర్

భారతీయ చరిత్రలో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది, గిధూర్ నగరానికి కేంద్రంగా గుర్తింపు పొందింది. మీరు జమూయి-ఝాజ్హ రాష్ట్ర రహదారి గుండా వెళ్ళేటప్పుడు తేలికగా ఈ టవర్ ని గుర్తించవచ్చు.

చిత్రకృప : Abhisuroon

జముయి ఎలా చేరుకోవాలి ?

జముయి ఎలా చేరుకోవాలి ?

రోడ్డుమార్గం

ముగాల్సరై-పాట్నా మార్గాన్ని కలిపే ప్రధాన రహదారి ఢిల్లీ-కోల్కతా తోపాటు ఏదోఒక మెట్రోపాలిటన్ నగరం నుండి జైముయి ను చేరుకోవచ్చు. ఈ దారి ప్రసిద్ధ గ్రాండ్ ట్రంక్ రహదారికి సమాంతరంగా వెళుతుంది.

రైలుద్వారా

జమూయి తూర్పు సెంట్రల్ రైల్వే లో దానాపూర్ విభాగం లో ప్రధాన రైల్వే
జంక్షన్లలో ఒకటి. ఇది హౌరా-పాట్నా-ముఘల్సరై ప్రధాన లైను

వాయుమార్గం

ఇక్కడి నుండి గయా అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 141 కిలోమీటర్ల దూరంలో ఉంటే, పాట్నా అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 161 దూరంలో ఉంది.

చిత్రకృప : LRBurdak

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X