Search
  • Follow NativePlanet
Share
» »అరేబియా సముద్రంలో అద్భుత శివాలయం !

అరేబియా సముద్రంలో అద్భుత శివాలయం !

By Mohammad

ఇంతవరకు మీరు ఆలయాలను కొండల మీద, గుట్టల మీద, నదులు - సముద్రాల ఒడ్డున, ఊరి మధ్యలో ... పర్వతాల్లో, గుహాల్లో చూసి ఉంటారు అవునా ? ఈ ప్రదేశాల్లో కాకుండా, ఇంకా ఎక్కడైనా మీరు ఆలయాలను చూశారా ?ఊహించండి ... ఇంకా ఏదైనా ప్రదేశం మీ బుర్రకు తట్టవచ్చేమో ..? (లేదు కదూ ..!)

ఇది కూడా చదవండి : సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు !

సముద్రం లోపల ఊహించారా ? అవునండీ .. సముద్రం లోపలే ? ఏం ఆశ్చర్యపోతున్నారా ? నిజమండీ బాబోయ్ .. సముద్రం లోపల ఆలయం ఉంది. అదెక్కడో కాదు .. మన భారతదేశంలోనే ... అరేబియా సముద్రం లోపల ఉందండీ. ఇక్కడికి వెళితే రాగలమో ?లేమో ? అనేగా మీ సందేశం. అయితే దీని గురించి మీకు చెప్పాల్సిందే .. !

ఎక్కడ ఉంది ?

ఎక్కడ ఉంది ?

గుజరాత్ లోని భావ్ నగర్ నగరానికి సమీపాన ఉన్న కొలియాక్ అనే గ్రామంలో సముద్రం నుండి 1. 5 కిలోమీటర్ల లోపల ఉన్నది.

చిత్ర కృప : Siddharth Bargate

ఆలయం లో ప్రధాన దైవం ?

ఆలయం లో ప్రధాన దైవం ?

ఇక్కడ చెప్పబడుతున్న ఆలయం శివునికి అంకితం చేయబడినది. ఇందులో శివలింగం ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రధాన దైవం. ఈ గొప్ప శివలింగం అరేబియా సముద్రంలో ఉంటుంది.

చిత్ర కృప : Ice Cubes

వెళ్ళాలని ఉందా ?

వెళ్ళాలని ఉందా ?

ఆలయానికి ఏ టైమ్ అంటే ఆ టైమ్ లో వెళ్ళకూడదు. దీనికంటూ ఒక సమయం ఉంది. ఉదయాన్నే లేచి అక్కడికి వెళితే కనపడదు ఈ ఆలయం.

చిత్ర కృప : Darshan Trivedi

వెళ్ళాలని ఉందా ?

వెళ్ళాలని ఉందా ?

ఒకవేళ మీరు వెళ్లారే అనుకోండి ... అక్కడ మీకు ఆలయం కనిపించదు ... దూరంలో సముద్రంలో నిలబడి ఉన్న ద్వజస్తంభం కనిపిస్తుంది.

చిత్ర కృప : tamil oneindia

మరి ఎలా ఆలయాన్ని సందర్శించడం ?

మరి ఎలా ఆలయాన్ని సందర్శించడం ?

మధ్యాహ్నం పూట వెళితే మీరు ఆలయాన్ని చూడవచ్చు. ఆ సమయంలో సముద్రం మెల్లగా వెనక్కి వెళుతుంది (మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో ఈ దృశ్యం కనిపిస్తుంది).

చిత్ర కృప : tamil oneindia

మరి ఎలా ఆలయాన్ని సందర్శించడం ?

మరి ఎలా ఆలయాన్ని సందర్శించడం ?

అలా సముద్రం వెనక్కి వెళ్ళిన తరువాత మీరు ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళవచ్చు, ఆలయంలో పూజలు చేయవచ్చు.

చిత్ర కృప : tamil oneindia

మరి ఎలా ఆలయాన్ని సందర్శించడం ?

మరి ఎలా ఆలయాన్ని సందర్శించడం ?

ఇలా రాత్రి 10 గంటల వరకు మీరు అక్కడే .. ఆలయంలో హాయిగా గడపవచ్చు. ఆ సమయం దాటితే మాత్రం వెనక్కి వచ్చేయ్యాలి లేకుంటే సముద్రంలో కలిసిపోతారు.

చిత్ర కృప : tamil oneindia

హెచ్చరిక

హెచ్చరిక

రాత్రి 10 దాటితే సముద్రం మళ్లీ ముందుకు వచ్చి గుడిని ముంచెత్తుతుంది .. దాంతో గుడి కనిపించదు. ఇదీ ఇక్కడ జరిగే అద్భుత వింత.

చిత్ర కృప : Pulkit Nakrani

హెచ్చరిక

హెచ్చరిక

ఆలయంలో ఎత్తుగా ఉండేది ద్వజస్తంభం. సుమారు ఆ లెవల్ వరకు (20 మీ) నీళ్ళు వచ్చేస్తాయి. ఇలాగా కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచి జరుగుతుందట.

చిత్ర కృప : Kaushik Patel

పాండవులతో ఈ ఆలయ సంబంధం

పాండవులతో ఈ ఆలయ సంబంధం

ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతుంది. పాండవులు పూజలు చేసి ప్రతిష్టించిన 5 శివలింగాలు ఇప్పటికీ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి.

చిత్ర కృప : Kaushik Patel

తప్పక చూడవలసినది

తప్పక చూడవలసినది

పౌర్ణమి లో ... చంద్రుని వెన్నల కాంతుల్లో ... సముద్రం ముందుకు వచ్చి, మెల్లగా తనలోకి గుడిని తీసుకుపోవడం అద్భుతంగా కనిపిస్తుంది. వీలైతే చూడండి.

చిత్ర కృప : Vinoth Chandar

కొసమెరుపు

కొసమెరుపు

ఈ ఘట్టాన్ని తిలకిస్తున్నంత సేపు .. కళ్లుఆర్పకుండా చూస్తూ ఉండటమే ఇక్కడ కొసమెరుపు. చూస్తున్నంత సేపు ఇటువంటి అద్భుత దృశ్యం ప్రపంచంలో మరెక్కడా లేదేమో అనిపిస్తుంది.

చిత్ర కృప : gujarat tourism

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మీరు భావ్ నగర్ చేరుకోవాలి. భావ్ నగర్ నుండి బస్సుల్లో లేదా ఆటోల్లో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు.

చిత్ర కృప : gujarat tourism

భావ్ నగర్ చేరుకోవడం ఎలా ?

భావ్ నగర్ చేరుకోవడం ఎలా ?

విమాన మార్గం

భావ్ నగర్ లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి ముంబై, ఢిల్లీ, గాంధీనగర్, జైపూర్ వంటి అంగరాలకు రెగ్యులర్ గా విమానాలు నడుస్తుంటాయి.

రైలు మార్గం

భావ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా అహ్మదాబాద్, ఓఖా, వడోదర, ముంబై నగరాల నుండి ప్రతిరోజూ రైళ్లు నడుస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం

భావ్ నగర్ వ్యాపార నగరం. సమీప పట్టణాల నుండి, సూరత్, రాజ్ కోట్, జామ్ నగర్ ప్రాంతాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Trinidade

భావ్ నగర్ పర్యాటక స్థలాలు

భావ్ నగర్ పర్యాటక స్థలాలు

ఎలాగోలా ఇంత దూరం వచ్చారు. భావ్ నగర్ ను కూడా ఒకసారి చూసేస్తే పర్యటన అక్కడితో సమాప్తం అయిపోతుంది.

భావ్ నగర్ పర్యాటక స్థలాలు

చిత్ర కృప : Bernard Gagnon

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X