Search
  • Follow NativePlanet
Share
» »బుద్ధ పూర్ణిమ నాడు ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించండి..

బుద్ధ పూర్ణిమ నాడు ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించండి..

బుద్ధ పూర్ణిమ నాడు ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించండి..

భారతదేశంలోని ఈ ప్రదేశాలలో బౌద్ధమతపు గొప్ప చరిత్ర మరియు సంస్కృతి మీకు కనిపిస్తాయి. బుద్ధ పూర్ణిమ రోజున ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ప్రదేశాలు ఎంతో ఉత్తమమైనవి. నేడు బుద్ధ పూర్ణిమ, దీనిని బుద్ధ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది బౌద్ధ క్యాలెండర్‌లో ముఖ్యమైన రోజు. ఈ రోజును మహాత్మా బుద్ధుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. మహాత్మా బుద్ధుడు విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారంగా చెబుతున్నారు. ఆధ్యాత్మిక ప్ర‌యాణాల‌ను ఇష్ట‌ప‌డేవారు భారతదేశంలో ఉండే ఈ అనేక పురాతన బౌద్ధ ఆరామాలు మరియు దేవాలయాలు సంద‌ర్శించొచ్చు.

dhamekhstupasarnath1

ధమేఖ్ స్థూపం, సారనాథ్

ఉత్తరప్రదేశ్‌లో బుద్దునికి సంబంధించిన అనేక ప్ర‌దేశాలు ఉన్నాయి. అయితే అన్నింటికంటే ప్ర‌త్యేకం సారనాథ్‌లోని థ‌మేఖ్ స్థూపం. బౌద్ధ‌మ‌తంలోని నాలుగు ప‌విత్ర ప్ర‌దేశాల‌లో ఇది ఒక‌టి. ప్ర‌తి సంవ‌త్స‌రం ల‌క్ష‌లాదిమంది బౌద్ధ మ‌త‌స్థులు ఇక్క‌డికి వ‌స్తుంటారు. సార‌నాథ్‌లో బుద్ధ భ‌గ‌వానుడు త‌న మొద‌టి ఉప‌న్యాసం ఇచ్చాడు. ఈ ప్ర‌దేశం ప‌ర్యాట‌కులకు సందర్శించేందుకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. వారాణాసి కాంట్‌స్టేష‌న్ నుండి సార‌నాథ్ దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

sanchistupamadhyapradesh

సాంచి స్థూపం, మధ్యప్రదేశ్

సాంచి అనేది ఒక బౌద్ధ స‌ముదాయం. ఇది భార‌త‌దేశంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లాలో సాంచి ప‌ట్ట‌ణంలోని కొండ‌పై ఉన్న గొప్ప స్థూపానికి ప్ర‌సిద్ధి చెందింది. ఇది రైసెన్ ప‌ట్ట‌ణం నుండి 23 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌కు ఈశాన్య దిశ‌లో 46 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. సాంచి వ‌ద్ద ఉన్న గొప్ప స్థూపం భార‌త‌దేశంలోని పురాత‌న రాతి నిర్మాణాల‌లో ఒక‌టి. భార‌తీయ వాస్తుశిల్పం యొక్క ముఖ్య‌మైన స్మార‌క చిహ్నం. 3వ శతాబ్దం BCE నాటి అద్భుతమైన బౌద్ధ స్మారక చిహ్నం ఇది. అంతేకాకుండా ఈ ప్రాంతం క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది.

hemismonasteryladakh1

హేమిస్ మొనాస్టరీ, లడఖ్

హేమిస్ మొనాస్టరీ లడఖ్‌లోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ మఠాలలో ఒకటి. ఇది రంగురంగుల పండుగలు, పురాతన తంగ్కాస్ మరియు అరుదైన బౌద్ధ కళాఖండాలకు ప్రసిద్ధి చెందింది. హేమిస్ అనేది 17వ శ‌తాబ్ధానికి చెందిన బౌద్ధ‌క్షేత్రం. ఇది 1672లో తిరిగి స్థాపించ‌బ‌డింది. ల‌డ‌ఖ్‌లోని ఈ ప్ర‌సిద్ధ మ‌ఠం బౌద్ధ‌మ‌తం ద్రుక్పా వంశానికి చెందిన‌ది. ఈ ప్రాంతం అత్యంత ధ‌నిక ఆశ్ర‌మంగా కూడా పిల‌వ‌బ‌డుతుంది.

dharamsalahimachalpradesh1

ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్

ధ‌ర్మ‌శాల హిమాల‌యాల‌లో దూరంగా ఉన్న ఒక సుంద‌ర‌మైన మ‌రియు విశాల‌మైన హిల్‌స్టేష‌న్‌. కాంగ్రా జిల్లాలోని ఒక మునిసిప‌ల్ కౌన్సిల్‌. ఇది జిల్లా ప్ర‌ధాన కేంద్ర‌ము. దీన్ని గ‌తంలో భాగ్సు అని పిలిచేవారు. ఇది కాంగ్రా నుండి 18 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, బోధ్ గయ

ఈ ప్రదేశం బౌద్ధమతానికి జన్మస్థలం కావడమే కాకుండా, యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడానూ. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రసిద్ధ బోధి వృక్షం ఈ ప్రాంతంలో ఉంది.

తవాంగ్ మొనాస్టరీ, అరుణాచల్ ప్రదేశ్‌

భారతదేశంలోని అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన మఠాలలో ఒకటి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ మొనాస్టరీ. ఇక్కడ మీరు గౌతమ బుద్ధుని యొక్క భారీ బంగారు విగ్రహం, పురాతన గ్రంథాలు మరియు చుట్టుపక్కల పర్వతాల యొక్క అద్భుతమైన వీక్షణలను చూడొచ్చు.

ellora caves

అజంతా గుహలు, మహారాష్ట్ర

ఇవి భారతదేశంలోని అత్యంత సున్నితమైన బౌద్ధ రాక్-కట్ గుహలు. ఇవి UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చబడ్డాయి. ఈ గుహలు గౌతమ బుద్ధుని జీవితాన్ని వర్ణించే అద్భుతమైన పెయింటింగ్స్ మరియు శిల్పాలతో అలంకరించబడ్డాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+