కాపు , ఉడుపి పట్టణానికి దగ్గరలో ఒక అందమైన పట్టణం. ఇది కోస్తా తీరం. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు అంటే లైట్ హౌస్మరియు మరికాంబ దేవాలయం. స్ధానికంగానే కాక పక్క రాష్ట్రాలనుండి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ జరిగే సిర్సి మరికాంబ జాతర చాలా ప్రసిద్ధి ప్రతి సంవత్సరం దీనికి జనం తండోపతండాలుగా వస్తారు. కర్నాటకలో ఇది అతి పెద్ద దేవాలయం.
లైట్ హౌస్ ను 1901 లో నిర్మించారు. ఇది 27.12 మీ.ల ఎత్తు. దీనిని ప్రజలు సాయంత్రం 4 గంటలనుండి 6 గంటల వరకు ప్రతిరోజూ దర్శించవచ్చు. దీనిపైనుండి పట్టణ అందాలు అద్భుతంగా కనపడతాయి. కాపు కుందాపూర్ కు 50 కి.మీ.ల దూరంలో కలదు. హైవే 17 పై ఉడుపి నుండి మంగుళూర్ కు 12 కి.మీ.లు ప్రయాణించి ఈ చిన్న పట్టణాన్ని చేరవచ్చు.



Click it and Unblock the Notifications