కోట కోటేశ్వర దేవాలయం ఉడుపి జిల్లాలో కుందాపూర్ సమీపంలో కలదు. కోటేశ్వర కుందాపూర్ కు 4 కి.మీ.లు. కోటేశ్వర లో ఈ దేవాలయం ఒక ప్రధాన ఆకర్షణ. ఇంకా ఇక్కడే చిన్న దేవాలయాలు, సుబ్రమణ్య, గణపతి, గోపాల క్రిష్ణ, జ్యేత్సనా లక్ష్మిలవి కూడా కలవు.
దేవాలయం వద్ద పెద్ద కొలను కలదు. దీనికి అనేక గాధలున్నాయి. దీని కింద సొరంగ మార్గాలున్నాయని ఈ సొరంగం అక్కడకు 20 కి.మీ.ల దూరంలో కల వందారు కంబాల గడ్డ చేరుతుందని చెపుతారు. ఇక్కడే పట్టాభిరామచంద్ర మరియు కోదండరామ దేవాలయాలు కూడా కలవు. ప్రతి సంవత్సరం భక్తులు వేల సంఖ్యలో ఇక్కడకు పండుగలలో వస్తారు.
కుందాపూర్ నుండి రోడ్డు మార్గాలు కలవు. తరచు బస్ సర్వీసులు కుందాపూర్ నుండి కలవు. సమీప విమానాశ్రయం మంగుళూరు. మంగుళూరులో పర్యాటకులు బస చేయవచ్చు.



Click it and Unblock the Notifications