Search
  • Follow NativePlanet
Share

వైశాలి - బుద్ధుడి నిర్వాణం!

18

 

వైశాలి నగరానికి ఎంతో బలమైన చరిత్ర కలదు. వైశాలి నగరం ఒక అందమైన నగరం. దాని చుట్టూ అనేక అరటి, మామిడి తోటలు, వరిపొలాలు వుంటాయి. అక్కడకల బౌద్ధ ప్రదేశాల కారణంగా అది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయింది.

పర్యాటకుల మదిలో వైశాలి నగరం ఎల్లపుడూ గుర్తుంది పోతుంది. దీని చరిత్ర చెప్పాలంటే, ఈ నగర మూలాలు రామాయణ, మహాభారతలలో వున్నాయి. దీని పేరు విశాల్ రాజు పేరుతో పెట్టారు. మహావీరుడు పుట్టాక ముందే, ఈ నగరం లిచ్చావి రాజ్యానికి రాజధానిగా వుండేది.

బుద్ధుడు, ఈ ప్రదేశం లో బోధనలు చేయటం, మహావీరుడు ఇక్కడ జన్మించటంతో ఈ నగరం అనేక విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకొంది. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన వంద ఏళ్లకు వైశాలి రెండవ బౌద్ధ సమావేశాలు నిర్వహించింది. సుమారు క్రి. పూ.6 వ శతాబ్దంలోనే ఇక్కడ ఎన్నికైన ప్రతినిధుల మండలి వుండటంచే, చాలా మంది చరిత్రకారులు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మొదటి రిపబ్లిక్ గా గుర్తించారు. ఈ నగరం వాణిజ్య కు కూడా పేరు పడింది. ఇక్కడ ఒక ఇటుక స్తూప పక్కన నిర్మించిన అతి పెద్ద స్థంభం బుద్ధుడి చివరి ప్రసంగాన్ని రాబోయే అతని నిర్వానాన్ని చాటుతుంది. మతం, సంస్కృతి, పురావస్తు అంశాలలో వైశాలి టూరిజం అతి గొప్పదిగా చెప్పబడుతుంది.

వైశాలి పర్యటనలో ప్రధానంగా, అశోక స్థంభం, బుద్ధ స్తూపం, కుందల్పూర్, రాజ్ విశాల్ ఘర్, కరొనతిఒన్ ట్యాంక్ , బుద్ధి మాయి, రామ్చౌర, వైశాలి మ్యూజియం, వరల్డ్ పీస్ పగోడా, మొదలైనవి చూడాలి.

వైశాలి అక్కడ జరిగే మహావీరుడి జన్మదినం, వైశాలి మహోత్సవ కు పేరు గాంచింది. ఈ ఉత్సవం, వైశాలికి 35 కి.మీ.ల దూరంలోకల సోనెపూర్ లో జరుపుతారు. ఇంకా ఇక్కడ మధుబని పెయింటింగ్ లు, స్టోన్ శిల్పాలు, స్థానిక చేతి కళల వస్తువులు కలవు. ఈ వస్తువులను అందరూ తప్పక చూసి, కొనుగోలు చేసి ఆనందిస్తారు. ఇండ్లలో చేసిన బొమ్మలు, లక్క గాజులు అధికంగా వుంటాయి.

అందమైన బుట్టలు, చాపలు, చేతితో గడ్డి తో అల్లి తయారు చేయటం ఇక్కడి ప్రత్యేకత. రుచికరమైన పండ్ల రసాలు కూడా వుంటాయి. వైశాలి, రోడ్డు, రైలు, వాయు మార్గాలలో చేరవచ్చు. నేటికి ఈ నగర చారిత్రక వారసత్వం పర్యాటకులు చూసి ఆనందించవచ్చు. వైశాలి పర్యటన అక్టోబర్ నుండి మార్చ్ వరకు సౌకర్యవంతంగా చేయవచ్చు. వైశాలి కి 35 కి.మీ.ల దూరంలో ముజఫాపూర్ కలదు.

వైశాలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వైశాలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వైశాలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వైశాలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం వైశాలి నుండి పాట్న మరియు ఉత్తర బీహార్ లోని అనేక ప్రదేశాలుకు బస్సు లు కలవు. పాట్న నుండి వైశాలి కి టూరిస్ట్ కోచ్ లు తరచుగా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం హాజీపూర్ సమీప రైలు కూడలి. ఇది 35 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ నుండి ఢిల్లీ, కోల్కతా ముంబై, చెన్నై, వారణాసి వంటి ప్రధాన నగరాలు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం వైశాలికి సమీప ఎయిర్ పోర్ట్ పాట్న లో కలదు. ఇది 70 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీని నుండి అనేక ప్రధాన నగరాలు కలుపు బడి వున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue