శ్రీక్రిష్ణ భగవానుడిదైన కారణంగా కేరళ రాష్ట్రానికి వచ్చే చాలామంది పర్యాటకులు అదూర్ పట్టణానికి వస్తారు. పార్ధ సారధి దేవాలయంలో గణేషుడు, శివుడు కూడా పూజలు అందుకుంటారు. ఈ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే పది రోజుల పండుగ వేడుకలకు కేరళలోని వివిధ ప్రాంతాలనుండి భక్తులు వస్తారు.
పండుగ చివరి రోజు వేడుకగా దేవాలయంలో గజమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది ఒక ప్రధాన ఆకర్షణ. చూచేందుకు చాలా బాగుంటుంది. తొమ్మిది ఏనుగులు, అనేక అలంకరణలతో దేవాలయ ముందు భాగంలో ఒక గొప్ప ఊరేగింపుగా నడుస్తాయి. ఈ దేవాలయంలో ఘనంగా జరిగే మరో పండుగ అష్టమి రోహిణి పండుగ. ఇది క్రిష్ణుడి పుట్టిన రోజు పండుగ. చాలామంది స్ధానికులు జానపద కళలు, డ్యాన్సులు ప్రదర్శిస్తారు. వాటిలో పరిచముటుకలి, మయూర నృత్యం, అమ్మన్ కుడం మరియు వెలక్కాలి అనే ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications