ముసమ్మన్ బుర్జ్ లేడా టవర్ ని సమన్ బుర్జ్ లేదా షా బుర్జ్ అని కూడా పిలుస్తారు.ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రా కోట లో గల దివాన్-యే-ఖాయిస్ కి దగగ్రలో ఉంది.షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ స్మ్రుత్యర్ధం ఈ అష్టభుజి టవర్ ని 17 వ శతాబ్దం లో నిర్మించాడు.
ఇక్కడ నుండి సందర్శకులు తాజ్మహల్ ని చూడవచ్చు.ఈ బహుళ అంతస్తుల టవర్ అనేక విలువైన రాళ్ళతో పొదగబడి ఉంటుంది.ఈ టవర్ లో గూళ్ళ వంటి గదులనుండి అంతఃపుర స్త్రీలు బయటి కార్యకలాపాలని తమ ఏకాంతానికి భంగం కలుగకుండా వీక్షించవచ్చు.హాలు పైకప్పు మార్బుల్ తో నిర్మించబడినది. హాల్ చుట్టూ వరండా ఉంది హాలు మధ్య లో నగిషీలు చెక్కబడ్డ ఫౌంటెన్ కూడా ఉంది.కానీ దురద్రుష్ట వశాత్తూ షాజహాన్ కుమారుడు ఔరంగజేబు తన తండ్రి అయిన షాజహాన్ మరియు ఆయన కుమార్తే జహనార బెగుం ఇక్కడే నిర్బంధిచడం వల్ల వారు ఇక్కడే మరణించారు.



Click it and Unblock the Notifications