ఆహ్మెదబద్ వ్యాపారవేత్త చేత పది లక్షల విరాళం తో నిర్మించబడిన ఈ ఆలయం పదిహేనవ తిర్తంకర్ జైన్ అయిన ధర్మనాథ కి అన్కితమివ్వబడినది. 1848 లో తెల్లని పాలరాతితో ఈ ఆలయం సలాట్ సంఘం యొక్క అద్భుతమైన హస్తకళానైపుణ్యానికి చక్కటి ఉదాహరణ. ప్రత్యేకించి ఇది ప్రేమచంద్ సలాట్ యొక్క హస్తకళా నైపుణ్యంగా పేర్కొంటారు.
ఢిల్లీ గేటు కి సమీపం లో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఒక గోపురం కలిగిన మండపం, అందమైన రాతి చెక్కడాలతో అలంకరించబడిన 12 స్తంభాలు గమనించవచ్చు. ప్రధాన ఆలయం తూర్పు వైపున ఉండగా ఇతర జైన్ తిర్తంకర్ లకు 52 ఇతర మందిరాలు కలవు.
ఈ ఆలయ ప్రధాన ప్రవేశ మార్గం ముందు ఈ ఆలయం నిర్మించిన చాలా కాలం తరువాత కిరీటి స్థంభం లేదా మహావీర్ స్థంభాన్ని (గౌరవ ప్రధానమైన స్తంభాలు) నిర్మించారు. ఈ 78 అడుగుల ఎత్తైన బురుజు రాజస్థాన్ లో ని చిత్తోర్ టవర్ ని పోలి ఉంటుంది. ఈ బురుజుపై చెక్కడాలు మొఘల్ డిజైన్ ల ని పోలి ఉంటాయి.



Click it and Unblock the Notifications