ఆహ్మేదాబాద్ లో ఉన్న గుజరాత్ గ్రామ వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించే విశాల అనే అమ్యూజ్మెంట్ పార్క్ సందర్సకులకి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అచ్చమైన గుజరాతీ శైలిలో అలంకరించబడిన మట్టి గుడిసెలు అలాగే మకాన్స్ ఇక్కడ గమనించవచ్చు. లోబాన్ వాసనలు లేదా కాల్చివేసిన బొగ్గు వాసనలతో నిండిన గాలి, జానపద సంగీత కళాకారులు, తోలు బొమ్మలాటలు, నృత్యకారుల ప్రదర్శనలు ఇక్కడికి విచ్చేసిన సందర్శకుల ని ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం లో కి తీసుకువెళతాయి. అచ్చమైన గుజరాతీ వంటకాలని ఆకులలో వడ్డించగా అనిర్వచనీయమైన అనుభూతికి సందర్శకులు గురి అవుతారు.



Click it and Unblock the Notifications