Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అవన్తిపూర్

అవన్తిపూర్ - ఈశ్వర, విష్ణు దేవాలయాలు!

9

జమ్మూ & కాశ్మీర్ లో అవన్తిపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం లో రెండు పురాతన దేవాలయాలు అంటే శివ అవన్తీశ్వర మరియు అవన్తిస్వామి విష్ణు లవి కలవు. ఈ రెండు దేవాలయాలాను 9 వ శతాబ్దం లో రాజు అవంతి వర్మ నిర్మించాడు. వీటిలో ఒక దానిని లయకారుడు శివుడి కి మరి ఒకటి విష్ణువు కు నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం లో అనుసరించిన శిల్ప శైలి గ్రీకుల శిల్ప శైలి ని పోలి వుంటుంది.

ఈ యాత్రా స్థలాలు ప్రస్తుతం శిధిలావస్థలో కలవు. శివ అవన్తీశ్వర దేవాలయం సుల్తాన్ సికందర్ చే దాడి చేయబడింది. ఇతను భుక్తి సేన్ పేరుతో ఈ ప్రాంతాన్ని కొంత కాలం పాలించాడు. ఈ దాడి లో నిర్మాణం దెబ్బ తింది. అంతే కాక ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ వస్తువులు దాడులకు , ప్రకృతి విపత్తులకు నిలువలేక పోయాయి. కాలక్రమంలో ఇవి భూమిలో కలసి పోగా, వీటిని 18వ శతాబ్దం లో బ్రిటిష్ పాలకులు తవ్వకాలలో వెలికి తీసారు. ఆ సమయం లో వారు కొన్ని విగ్రహాలను తీసుకు పోయారు. ఈ దేవాలయాల కొన్ని కళా కృతులను ఇప్పటికి శ్రీ నగర్ లోని శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం లో చూడవచ్చు.

శివ అవన్తీస్వర మరియు అవన్తీస్వామి విష్ణు దేవాలయాలు శిదిలావస్థ లో ఉన్నప్పటికీ , ఈ గుడుల విగ్రహాలు రూపం మారినప్పటికీ వాటిని చూడవచ్చు. అవన్తిపూర్ చూడాలనుకునే వారు విమానం, రైల్వే లేదా రోడ్ మార్గం లో ప్రయాణించవచ్చు. అవన్తిపూర్ కు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్ ఇది 29 కి. మీ. ల దూరం లో కలదు.

అవన్తిపూర్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్ లకు రైళ్ళు కలవు. పర్యాటకులు బస్సులలో కూడా ఈ ప్రాంతాన్ని చేరవచ్చు. అయితే, అవన్తిపూర్ కు నేరు బస్సు లు లేవు. మొదటగా శ్రీనగర్ చేరి అక్కడ నుండి అవంతి పూర్ కు బస్సు చేపట్టాలి. అవన్తిపూర్ వెళ్ళాలి అనుకునేవారు వాతావరణ అనుకూల పరంగా, ఏప్రిల్ మరియు నవంబర్ ల మధ్య సందిర్సిస్తే అనుకూలంగా వుంటుంది.

అవన్తిపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అవన్తిపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అవన్తిపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అవన్తిపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం అవన్తిపూర్ రోడ్ మార్గం లో చేరాలనుకునే వారికి న్యూ ఢిల్లీ (810 కి. మీ.), లెహ్ (443 కి.మీ.), జమ్మూ (262 కి.మీ. ), పహల్గాం (65 కి. మీ.)చండీఘర్ (565 )కి. మీ. దూరాలలో వివిధ మార్గాల నుండి శ్రీనగర్ కు బస్సు లు కలవు. శ్రీ నగర్ నుండి నేరు బస్సుల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అవన్తిపూర్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం. సుమారు 269 కి. మీ. ల దూరం లో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశం లోని అన్ని ప్రధాన రైలు స్టేషన్ లకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి అవన్తిపూర్ కు టాక్సీలు బస్సు లు లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం శ్రీ నగర్ లోని షేక్ ఉల్ ఆలం ఎయిర్ పోర్ట్ అవన్తిపూర్ కు 37 కి. మీ.ల దూరం లో కలదు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఢిల్లీ లో కలదు. షేక్ ఉల్ అలం ఎయిర్ పోర్ట్ నె శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ అంటారు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu