Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బన్స్వారా

బన్స్వారా – శతద్వీప నగరం !

24

సమీక్షరాజస్థాన్ రాష్ట్రం లోని దక్షిణ భాగం లో వున్న నగరం బన్స్వారా 5307 చ.కి.మీ లలో విస్తరించి వున్న బన్స్వారా జిల్లాకు ఇది పరిపాలనా కేంద్రం. 302 మీటర్ల సగటు ఎత్తులో వున్న ఈ నగరం మహారావాల్ జగమల్ సింగ్ స్థాపించిన ఒకప్పటి రాజ్య౦. ‘బన్స్’ అంటే వెదురు అడవులు అనే మాట నుంచి ఈ ఊరికి బన్స్వారా అనే పేరు వచ్చింది.

బన్స్వారా పట్టణం ద్వారా ప్రవహించే మహీ నది లో వున్న వందలాది ద్వీపాల కారణంగా ఈ ఊరిని ‘శతద్వీప నగరం’ అని కూడా అంటారు.ఒకప్పటి రాజ సంస్థానం బన్స్వారా జిల్లాను మాహారావల్ వంశీకులు పాలించారు. వగద్ లేదా వగర్ అనబడే ఈ ప్రాంతం లోని తూర్పు భాగంలో బన్స్వారా వుంది. జానపదుల ప్రకారం ఈ ప్రాంతాన్ని భిల్లు రాజు బంసియా పాలించి తన పేరిట బన్స్వారా గా నామకరణం చేసాడు. తరువాత జగమల్ సింగ్ అతన్ని ఓడించి చంపి ఈ రాజ్యాన్ని పాలించిన మొదటి మహారావల్ అయ్యాడు.

చిన్న జల్లియన్వాలా బాగ్1913లో అప్పటి ప్రభుత్వం పై సంఘ సంస్కర్త గోవింద గిరి, పంజా ల నేతృత్వం లో కొందరు భిల్లులు తిరుగుబాటు చేసారు. అయినప్పటికీ వారి తిరుగుబాటును అణచివేసి మానఘర్ కొండ వద్ద శాంతియుత సమావేశం నిర్వహిస్తున్న వందలాది మంది భిల్లులను కాల్చి చంపారు. ఈ సంఘటనను చిన్న జల్లియన్వాలా బాగ్ సంఘటన గా పిలుస్తారు. ఈ సంఘటన జరిగిన మానఘర్ కొండ పవిత్రంగా భావించబడి మానఘర్ ధామ్ గా పిలువబడుతోంది.స్థానికులు, భాషలు భారత స్వాతంత్ర్యం తరువాత, 1949 లో బన్స్వారా రాజ్యాన్ని కుశాల్ ఘర్ రాజ్యాన్ని రాజస్తాన్ లో విలీనం చేసి బన్స్వారా ను ప్రత్యెక జిల్లాగా తీర్చిదిద్దారు.

భిల్లులు, భిల్లు మీనాలు, దామర్లు, చార్పోతాలు, నినామాల తోపాటు పటేల్, రాజపుత్ర, బ్రాహ్మణ, మహాజనుల వంటి ప్రధాన కులస్తులు ఈ ప్రాంతంలో నివసిస్తారు. గుజరాతీ, మేవారీ భాషల మిశ్రమ౦ వాగ్రీ, ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష.

బన్స్వారా లో ఆకర్షణలు త్రిపుర సుందరి, మహీ జలాశయం, కాగ్డి పిక్ అప్ వయర్, మదారేశ్వర్ శివాలయం ఈ ప్రాంతం లోని ప్రసిద్ధ ఆకర్షణలలో కొన్ని. బన్స్వారా జిల్లాలోని ఇతర ఆకర్షణలలో అబ్దుల్లా పీర్, ఆనంద సాగర్ సరస్సు, భీమ కుండ్, అ౦దేశ్వర్ (జైన దేవాలయం), చీన్చ్ బ్రహ్మ దేవాలయం ఉన్నాయి. బన్స్వారా చేరుకోవడం 181 కిలోమీటర్ల దూరంలోని ఉదయపూర్ ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. జోధ్పూర్, జైపూర్, ముంబై, డిల్లీ లకు ఇక్కడి నుండి నిత్యం విమానాలు తిరుగుతాయి. రత్లాం, దుంగర్పూర్, దోహాద్, జైపూర్ ల నుండి బన్స్వారా కు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఆగస్ట్ నుండి మార్చ్ మధ్య కాలం బన్స్వారా సందర్శనకు అనువైన సమయం.

బన్స్వారా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బన్స్వారా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బన్స్వారా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బన్స్వారా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్ధల ద్వారా నడపబడుతున్న అనేక బస్సులు బన్స్వారా ను రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలకు కలుపుతున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్లం, బన్స్వారా కు దగ్గరి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు నిత్యం రైళ్ళు తిరుగుతాయి. ఇక్కడి నుండి బన్స్వారా కు బాడుగ టాక్సీలలో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రయాణానికి ఉత్తమ మార్గం బన్స్వారా కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం ద్వారా: ఉదయపూర్ మహారాణా ప్రతాప్ విమానాశ్రయం బన్స్వారా కు దగ్గరలో ఉంది. ఇక్కడి నుండి 181 కిలోమీటర్ల దూరంలో ఉన్న బన్స్వారా కు బాడుగ టాక్సీల ద్వారా చేరుకోవచ్చు. నిత్యం తిరిగే విమాన సర్వీసుల ద్వారా ఈ విమానాశ్రయం న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి, జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయానికి అనుసంధానించబడి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu