బస్తీ ఉత్తర ప్రదేశ్ లోని బస్తి జిల్లాలో కల ఒక పట్టణం. పురాతన కాలంలో దీనిని అనేక రాజ వంశాలు పాలించి దీనిని సాంస్కృతిక పరంగా అభివృద్ధి చేసాయి. వెదురు అడవులు, మామిడి తోటలు అధికంగా కల ఈ ప్రాంతం 1865లో అధికారికంగా ఒక పట్టణంగా ప్రకటించబడింది. నగర బిజీ జీవితాలకు దూరంగా వుండే ఈ ప్రదేశం దట్టమైన పచ్చనడం కలిగి ఆహ్లాదకరంగా వుంటుంది.
బస్తి లోను, చుట్టూ పక్కల కల టూరిస్ట్ ప్రదేశాలు
బస్తి లో అనేక ఆకర్షణలు కలవు. వీటిలో చాందో తాల్ ప్రధాన విహార ప్రదేశం. మరొకటి బస్తీకి సమీపంలో కల బారా గ్రామం. ఈ చిన్న గ్రామం గురించి పురాణ ఇతిహాసాలలో కూడా చెప్పబడింది. ఇక్కడ ఒక పురాతన శివాలయం కలదు. దీనిని బాదేస్వర నాథ్ టెంపుల్ అంటారు. ఇది, కువానా నది ఒడ్డున కలదు. ఇక్కడే కల రాష్ట్రీయ వన చేతన కేంద్రం మరియు హార్టికల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ లు కూడా చూడాలి. షాపింగ్ చేయ గోరె వారు, పక్కే బజార్ లో దుస్తులు, ఇతర స్థానిక చేతి కళల వస్తువులు కొనవచ్చు.



Click it and Unblock the Notifications