Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చిఖల్ దార

చిఖల్ దార - ఒక పౌరాణిక కధ

14

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో కల చిఖల్ దార వన్య జంతు సంరక్షణాలయానికి పేరుగాంచింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి షుమారుగా 1120 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రాంతంలో మహారాష్ట్రలోని కాఫీ తోటలు కూడా కలవు.

ఛిఖల్ దార ప్రదేశాన్ని హైద్రాబాద్  మిలిటరీ విభాగానికి చెందిన రాబిన్ సన్ అనేఒక కెప్టెన్ 1823 సంవత్సరంలో కనిపెట్టాడు. ఆ ప్రాంతంలోగల పచ్చదనం అతనికి తన మాతృదేశం ఇంగ్లాండ్ వాతావరణాన్ని గుర్తుతెచ్చింది. వెంటనే అతను చిఖల్ దార ప్రదేశాన్ని ఇండియా ప్రభుత్వ కేంద్రంగా చేయాలని ప్రతిపాదనలను పంపాడు. అయితే, ఆ ప్రతిపాదనలను బ్రిటీష్ ప్రభుత్వం ఖాతరు చేయలేదు.

ఎంతో ఎత్తైన ప్రదేశంలోకల చిఖల్ దారా వెనుక ఆసక్తికర కధ ఒకటి ఉంది. పౌరాణిక కధల మేరకు చిఖల్ దారా ప్రదేశం మహాభారత కాలం నాటి ఒక రాజైన కీచకుడు పాలించాడని, అతడిని పాండవులలో ఒకడైన భీముడు వధించి అతడి శరీరాన్ని అక్కడే ఉన్న ఒక లోయలోకి బలంగా విసిరేశాడని చెపుతారు. చిఖల్ అంటే కీచకుడని దార అంటే లోతైన లోయ అని అర్ధంగా చెపుతారు.

ఈ ప్రదేశంలోకి శ్రీ క్రిష్ణుడు రుక్మిణి దేవిని తీసుకు వచ్చినట్లుగాకూడా చెపుతారు.  

చిఖల్ దార - వన్య జంతువుల స్వర్గంచిఖల్ దార ప్రాంతంలో ఎన్నో రకాల వన్య ప్రాణులు కలవు. ఈ ప్రదేశం నిండా వివిధ రకాల పక్షులు, జంతువులు, వివిధ రకాల వృక్షాలు వుండి ప్రకృతి  ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తుంది. చిఖల్ దార శాంక్చురీ లో ఫ్లయింగ్ స్క్విరల్, మౌజ్ జింక, పందికొక్కు, లంగూర్, చౌసింగా, నీలం ఎద్దు, ఇండియన్ బైసన్, అడవి కుక్క, చిరుత, పంగోలిన్, రెసస్ కోతి, అడవి పంది,  చుక్కల జింక, మొరిగే జింక, సాంబార్, ఎలుగుబంటి మరియు పులి వంటి జంతువులు అనేకం కలవు.

వృక్షాలలో టేకు మరియు బాంబూ మహువా, ధఓడా,   కుసుం , చెట్లు అనేకం కలవు.  ఇక్కడకల టైగర్ ప్రాజెక్ట్ లో భారతదేశం లో కొన్ని మిగిలిన పులులలో ఇప్పటికి 82 వరకు కలవు.చిఖల్ దారా యొక్క ఆకర్షణ ప్రదేశాలు దేవి పాయింట్, ప్రాస్పెక్ట్ పాయింట్ మరియు హరికేన్ పాయింట్ లనుండి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

మీరు ఒక కళాకారుడు మరియు చరిత్ర ప్రియుడు అయితే, నార్నాల కోట మరియు గవిల్ ఘర్ కోటలకు ఒక పర్యటన తప్పక చేయాలని మరిచిపోకండి. ఈ కోటలు రెండూ పురాతన మైనవి మరియు ఎన్నో శతాబ్దాల క్రిందట నిర్మించబడినవి. ఇవి భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక చరిత్ర చూపే విండో వలే ఉంటాయి. 

కొన్ని ఇతర వాస్తవాలుచిఖల్ దారా వాతావరణం ప్రధానంగా సముద్ర ప్రదేశ వాతావరణంగా ఉంది. ఉష్ణోగ్రతలు చాలా అధికంగా పెరగడం లేదా చాలా తక్కువ  స్తాయిలలో ఉండవు. వేసవి సీజన్ ఒక మాదిరి వేడి, అధికంగా ఉండదు. చిఖల్ దారా వాతావరణం పర్యాటకులకు ఎంతో ఆనందం కలిగించేదిగా ఉంటుంది. పడే వర్షాలు ప్రాంతాన్ని అద్బుతంగా మార్చేస్తాయి. ఈ ప్రాంత సందర్శనకు శీతాకాలం అనుకూలమైంది. మీ వినోద విహారాలకు ఈ సమయం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

చిఖల్ దారాకు వాయు, రైలు, బస్ మార్గాల ద్వారా ప్రయాణించవచ్చు. అకోలా విమానాశ్రయం సమీపంలోని స్ధానిక విమానాశ్రయం. ట్రైన్ పై వెళ్ళాలనుకునేవారికి చిఖల్ దారాకు బద్ నేరా రైలు స్టేషన్ సమీపంగా ఉంటుంది. ఇక్కడనుండి శాంక్చురీకి క్యాబ్ లు లభిస్తాయి. రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారు ప్రభుత్వ లేదా ప్రయివేటు బస్సులలో ప్రయాణించవచ్చు.

అయితే, ప్రభుత్వ రవాణా ప్రయివేటు రవాణా వాహనాల స్ధాయి సౌకర్యాలు అందించలేదు.   చిఖల్ దారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ ప్రాంతంలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ శాంక్చురీలో అనేక రకాల పక్షులు, జంతువులు కలవు. అన్ని వేళలా వీచే చల్లటి గాలుల ఈ ప్రదేశానికి అనేక ప్రధాన నగరాలు అంటే, ముంబై మరియు పూనే వంటి వాటికి చక్కటి రవాణా కలిగి ఉంది. మీరు కనుక ప్రకృతిని ప్రేమించే వారు, జంతువులను ప్రేమించే వారు అయితే, ఈ ప్రదేశాన్ని తప్పక చూసి తీరాలి.

చిఖల్ దార ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చిఖల్ దార వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చిఖల్ దార

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చిఖల్ దార

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం చిఖల్ దారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మంచి రోడ్డు మార్గం కలిగి ఉంది. మహారాష్ట్రలోని అనేక పట్టణాల నుండి చిఖల్ దారకు బస్సులు ప్రతి రోజూ నడుస్తూంటాయి. ఈ బస్సులు ప్రభుత్వం లేదా ప్రయివేటు ఆపరేటర్లు కూడా నడుపుతూంటారు. ప్రయాణ ఛార్జీలు మీరు ఎంపిక చేసుకునే బస్సు సౌకర్యాన్నిబట్టి ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం 110 కి.మీ.ల దూరంలో కల బద్ నేరా స్టేషన్ చికల్ ధారాకు సమీప రైలు స్టేషన్. ఇది సెంట్రల్ రైల్వేలో కలదు. మహారాష్ట్ర లోని మరియు వెలుపల కల ప్రధాన నగరాలు, పట్టణాలనుండి బద్ నేరా కు రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కి.మీ.కు రూ. 7 చొప్పున టాక్సీలు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం చిఖల్ దారా కు అకోలా విమానాశ్రయం సమీపంగా ఉంటుంది. దీని దూరం సుమారు 150 కి.మీ.లు. విమానాశ్రయం నుండి చిఖల్ దారా చేరేందుకు అనేక టాక్సీలు కలవు. టాక్సీ ఛార్జీలు సాధారణంగానే ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed