నేషనల్ రైల్వే మ్యూజియం ఢిల్లీ లో గల ఒక ప్రత్యేక దర్శనీయ స్థలం. భారతీయ రైల్వే చరిత్ర మరియు వైభవాన్ని ఈ మ్యూజియం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఢిల్లీ చాణక్యపురి లో గల ఈ మ్యూజియం ఫిబ్రవరి ఒకటి 1977 లో ప్రారంభించబడినది.
భారతీయ రైల్వే కి చెందిన సిగ్నలింగ్ వ్యవస్థ కి చెందిన వస్తువులు,పురాతన ఫర్నీచరు,చారిత్రక ఫోటోలు మరియు సాహిత్యానికి సంబంధించి 100 రకాల వస్తువులు ప్రదర్సింపబడుతున్నాయి. మైసూర్ మహారాజా కొరకు మరియు వేల్స్ మహారాజు కోసం ప్రత్యేకం గా నిర్మించ బడిన కోచ్ లు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. మ్యూజియంలో సందర్శకులని తిప్పి చూపించటానికి ఏర్పాటు చేసిన టాయ్ ట్రెయిన్ కూడా ప్రత్యేక ఆకర్షణే. ఈ మ్యూజియం సందర్శుకల కొరకు సోమవారం తప్ప మిగతా రోజులలో ఉదయం 10 నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరిచి ఉంటుంది.



Click it and Unblock the Notifications