చుట్టూ పరచుకున్న పచ్చని అడవుల మధ్య దేవరాయనదుర్గ లోని రాతి కొండలు ఈ ప్రాంత సందర్శన ను ఆహ్లాదకరంగా మారుస్తాయి. 3940 అడుగుల ఎత్తులో వుండడం వల్ల ఈ ప్రాంతంలోని వాతావరణం కట్టి పడేస్తుంది.
దేవరాయనదుర్గ, కర్ణాటకలోని తూమ్కుర్ జిల్లలో ఉంది, అక్కడి ఆలయాలు, అడవులు అలాగే అద్భుతమైన వాతావరణం, అక్కడి అందమైన దృశ్యాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి.
దేవరాయనదుర్గను వోడేయార్లు పాలించారు – జడక అనే ఒక సామంత రాజును ఓడించి ఈ పట్టణాన్ని చేజిక్కించుకున్న చిక్క దేవరాజ వడేయార్ రాజు పేరిట ఈ ఊరు ఏర్పడింది.
దేవరాయనదుర్గలో గుర్తుంచుకోవలసిన స్థలాలు
ఈ కొండ ప్రాంతం లో భోగనరసింహ, యోగనారసింహ, లక్ష్మీ నరసింహ దేవాలయాలు వున్నాయి. దేవరాయనదుర్గ లో మూడు ప్రత్యేకమైన ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. యోగనారసింహ విగ్రహం కొండ పైన ఉంటె, భోగనరసింహ ఆలయం కొండకింద ఉంది. లక్ష్మి నరసింహ దేవాలయం మొదటి ఎత్తులో ఉంది.
ఇక్కడి మరొక ఆకర్షణ సహజ నామద చిలుమే బుగ్గ. స్థానిక పురాణం ప్రకారం రాముడు తన విల్లు నుండి భూమి మీదకు బాణాన్నిసంధించినపుడు ఈ బుగ్గ నీటిని స్రవించింది. ఈ బుగ్గ సమీపంలోని నేలపై రాముని పాదముద్రలు ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఈ అడవులలో అరుదైన ఆయుర్వేద మొక్కలు పండించే నర్సరీ ఉంది, ఇక్కడ రథోత్సవం, శ్రీ నరసింహ జయంతి చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.
దేవరాయనదుర్గ, బెంగళూర్ నించి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి తూమ్కుర్ దగ్గరి రైల్వే స్టేషన్. ఈ ప్రాంతం నించి అనేక బస్సులు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications