Search
  • Follow NativePlanet
Share

ద్రాస్- “లడఖ్ కు ప్రవేశద్వారం”

10

“లడఖ్ కు ప్రవేశద్వారం” అని కూడా పిలవబడే ద్రాస్, జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం సముద్ర మట్టానికి 3280 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సైబీరియా తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత శీతల నివాస ప్రాంతంగా గుర్తించబడింది. 1999 లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన కార్గిల్ నుంచి సుమారు 62 కి. మీ ల దూరంలో ఉన్న ద్రాస్, ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా పేరు పొందింది.

లడఖ్ కు మాత్రమే కాకుండా, ద్రాస్, జమ్మూ & కాశ్మీర్ లోని ఇతర ప్రముఖ పర్వత ప్రాంత పట్టణాలకు మరియు నగరాలకు ప్రవేశద్వారం గా పనిచేస్తుంది. ఎగుడుదిగుడుగా ఉండే ఈ పట్టణ భూభాగం, సాహస కార్యకలాపాలకు అత్యంత అనువుగా ఉండటంవల్ల, పర్యాటకుల లో బాగా ప్రసిద్ధి చెందింది. ద్రాస్ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులు, పట్టణం సమీపంలో ఉన్న సురు లోయ వద్ద ట్రెక్కింగ్ చేయవచ్చు. అంతేకాకుండా, ప్రయాణికులు, ఇక్కడి నుంచి, అమర్ నాథ్ గుహకు, 200 మీటరల ఎత్తు కనుమ దాటి వెళ్లాల్సి ఉండే మార్గం, ఎంచుకునే అవకాశం ఉంది.

ద్రాస్ పర్యటనలో, ప్రయాణికులు కార్గిల్ యుద్ధం లో ప్రాణాలు బలి ఇచ్చిన సైనికుల స్మారకాన్నితప్పక చూడాలి. నివేదికల ప్రకారం, మొత్తం రెండు వైపుల నుండి కలిపి సుమారు 1200 సైనికులు యుద్ధంలో మరణించారు. యుద్ధ స్మృతి చిహ్నం పక్కనే యుద్ధ జ్ఞాపకార్థమైన వస్తువులను ప్రదర్శించేందుకు ఒక సంగ్రహాలయం నిర్మించబడింది. పర్యాటకులు సమీపంలో ఉండే ద్రౌపది కుండ్ కూడా చూడవచ్చు.

ద్రాస్ పర్యటించాలనుకునే యాత్రికులు విమాన యానం, రైల్వే, లేదా రహదారుల ద్వారా గమ్యం చేరుకోవచ్చు. ద్రాస్ సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నుండి సెప్టెంబర్ దాకా ఉండే వేసవి కాలం.

ద్రాస్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ద్రాస్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ద్రాస్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ద్రాస్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: ద్రాస్ కు రహదారి గుండా వెళ్ళే ఆసక్తి గల యాత్రికులు, బస్సులు లేదా టాక్సీలు ద్వారా గానీ గమ్యం చేరుకోవచ్చు. ద్రాస్ వరకు ప్రత్యక్ష బస్సులు లేవు. అయితే, శ్రీనగర్ నుంచి ద్రాస్ కు బస్సులు ఉన్నాయి. శ్రీనగర్ కు నేరుగా కొత్త ఢిల్లీ, లుధియానా, చండీగఢ్, అంబాలా, జలంధర్, మరియు సిమ్లా వంటి నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు: 152 కి.మీ ల దూరంలో ఉన్న శ్రీనగర్ రైల్వే స్టేషన్, ద్రాస్ కు అతి సమీపంలోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే కూడలి భారతదేశం లోని అన్ని ప్రధాన కూడళ్ళతో అనుసంధానించబడింది. శ్రీనగర్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత, ప్రయాణికులు ద్రాస్ ను బస్సులు లేదా టాక్సీ లో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన యానం: 157 కి.మీ. ల దూరంలో లో ఉన్న “షేక్ ఉల్ ఆలం విమానాశ్రయం” అని కూడా పిలవబడే శ్రీనగర్ విమానాశ్రయం, ద్రాస్ కి అతి సమీపం లోని విమానాశ్రయం. కొత్త ఢిల్లీ, ముంబై, మరియు జమ్మూ లాంటి భారతదేశం లోని ఇతర ప్రధాన విమానాశ్రయాల తో అనుసంధానించబడింది. విమానాశ్రయం నుండి ద్రాస్ కు బస్సులు మరియు టాక్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu